ఘనంగా జరిగిన సైమా- 2024 అవార్డ్స్ వేడుకలు

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) – 2024 వేడుకలు దుబాయి వేదికగా ఘనంగా జరిగాయి.  దక్షిణాది భాషల సంబంధించిన అతిరథ మహారథులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. హీరోలు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, నిర్మాతలు అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు.    

ఈ అవార్డ్స్‌లో నేచురల్ స్టార్ నాని సినిమాల హవా కొనసాగింది. దసరా, హాయ్ నాన్న చిత్రాలు అవార్డులు కొల్లగొట్టాయి. 2024 సంవత్సరానికి గానూ ‘దసరా’ మూవీలో నటనకు ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేశ్‌ అవార్డును అందుకున్నారు.

ఉత్తమ చిత్రంగా గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ-అనిల్‌ రావిపూడి, షైన్ స్క్రీన్స్ బ్యానర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్‌ కేసరి’ నిలిచింది.

సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అందుకున్నారు.

‘బేబీ’ చిత్రం నాలుగు అవార్డులని సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడు (క్రిటిక్స్) గా ఆనంద్ దేవరకొండ, ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్ గా సాయి రాజేష్ , ఉత్తమ డెబ్యు నటి గా వైష్ణవి చైతన్య, ఉత్తమ లిరిక్స్ రైటర్ గా అనంత శ్రీరామ్ గా బేబీ చిత్రానికి గాను అవార్డులు అందుకున్నారు.

ఉత్తమ దర్శకుడు పాపులర్ గా శ్రీకాంత్ ఓదెల (దసరా), ఉత్తమ నటి క్రిటిక్స్ గా  మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్నా), బెస్ట్ డెబ్యు డైరెక్టర్ గా  శౌర్యువ్ (హాయ్ నాన్న),  ఉత్తమ డెబ్యు ప్రొడ్యూసర్స్  గా వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, విజయేందర్ రెడ్డి తీగల (హాయ్ నాన్న), ఉత్తమ సంగీత దర్శకుడి గా హేషామ్ అబ్దుల్ వహాబ్ (హాయ్ నాన్న), ఎమర్జింగ్ యాక్టర్ గా సుమంత్ ప్రభాస్ (మేమ్ ఫేమస్) అవార్డులు అందుకున్నారు.

అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ఎంతోమంది హీరో, హీరోయిన్స్ తమ స్పెషల్ పెర్ఫార్మెన్స్ లతో కనువిందు చేశారు.

SIIMA చైర్‌పర్సన్స్ విష్ణు వర్ధన్ ఇందూరి, బృందా ప్రసాద్ అడుసుమిల్లి మాట్లాడుతూ..’సౌత్ ఇండియన్ సినిమాలోని ది బెస్ట్ ని సెలబ్రేట్ చేసుకోవడం ఎంతోఆనందం వుంది. ఈవెంట్ ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన సెలబ్రిటీస్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’ తెలిపారు.

‘సైమా’ 2024 అవార్డ్స్ విన్నర్ :  
ఉత్తమ చిత్రం:  భగవంత్ కేసరి
ఉత్తమ నటుడు పాపులర్ : నాని (దసరా)
ప్రముఖ ఉత్తమ నటి పాపులర్ .: కీర్తి సురేష్ (దసరా)
ఉత్తమ నటి క్రిటిక్స్ : మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్నా)
ఉత్తమ దర్శకుడు పాపులర్ : శ్రీకాంత్ ఓదెల (దసరా)
ఉత్తమ నటుడు క్రిటిక్స్: ఆనంద్ దేవరకొండ(బేబీ)
సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: సందీప్ రెడ్డి వంగా
ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్ : సాయి రాజేష్ (బేబీ)
ఉత్తమ హాస్యనటుడు: విష్ణు(మ్యాడ్)
ఉత్తమ ప్రతినాయకుడు : దునియా విజయ్ (వీర సింహారెడ్డి )
ఉత్తమ సహాయ నటి: బేబీ కియారా (హాయ్ నాన్న)
ఉత్తమ సహాయ నటుడు:  దీక్షిత్ శెట్టి (దసరా)
బెస్ట్ డెబ్యు డైరెక్టర్:  శౌర్యువ్ (హాయ్ నాన్న)
ఉత్తమ డెబ్యు ప్రొడ్యూసర్స్ : వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, విజయేందర్ రెడ్డి తీగల (హాయ్ నాన్న)
ఎమర్జింగ్ యాక్టర్ : సుమంత్ ప్రభాస్
ఉత్తమ డెబ్యు నటి: వైష్ణవి చైతన్య ( బేబీ )
ఉత్తమ డెబ్యు నటుడు :  సంగీత్ శోభన్ (మ్యాడ్ )
ఉత్తమ సంగీత దర్శకుడు : హేషామ్ అబ్దుల్ వహాబ్ (హాయ్ నాన్న)
ఉత్తమ నేపథ్య గాయని : శక్తిశ్రీ గోపాలన్ (హాయ్ నాన్న )
ఉత్తమ గాయకుడు :  రామ్ మిర్యాల (బలగం)
ఉత్తమ లిరిక్స్ రైటర్ : అనంత శ్రీరామ్ (బేబీ)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: భువన్ గౌడ (సలార్)

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago