“సఃకుటుంబానాం” ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన యూనిట్

మహాదేవ గౌడ్ నూతనంగా నిర్మిస్తున్న సినిమా ‘సఃకుటుంబానాం’ హెచ్ ఎన్ జి సినిమాస్ బ్యానర్ లో మొదలైంది. ఉదయ్ శర్మ రాచనా, దర్శకత్వం చేయగా, రామ్ కిరణ్ హీరోగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు, హీరోయిన్ గా మేఘ ఆకాష్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

నిర్మాత మహాదేవ గౌడ్ మాట్లాడుతూ: ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. అచ్చమైన తెలుగింటి టైటిల్ అని కూడా చాలా మంది మెచ్చుకుంటున్నారు. రేషన్ కార్డు డిజైన్ లా ఉన్న పోస్టర్ బట్టి సినిమాకూడా మంచి క్రియేటివిటీతో కూడిన కుటుంబ కథా చిత్రం అవుతుంది అనేలా ఉంది. ముఖ్యంగా ఇంత మంచి కాంబినేషన్స్ రావడం చాలా సంతోషం. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య, రాజశ్రీ నాయర్, శుభలేఖ సుధాకర్, భద్రం, తాగుబోతు రమేష్, నిత్యశ్రీ, రమేష్ భువనగిరి, శ్రీప్రియ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ మ్యుజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సఃకుటుంబానాంకు మ్యుజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మధు దాసరి, శశాంక్ మాలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

డైరెక్టర్ ఉదయ్ శర్మ మాట్లాడుతూ: రేషన్ కార్డు లాగా ఉన్న ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి మణిశర్మ గారు చాలా పెద్ద అసెట్. కంటెంట్ ని నమ్మి మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. రీసెంట్ గా ఇంత మంది ఆర్టిస్టులు ఇంత మంచి కాంబినేషన్స్ తో ఏ సినిమా రాలేదు, కంటెంట్ ఉంటె తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు అని నిరూపిస్తారు. మా సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది, ఎంతో మంది సీనియర్స్ ఇందులో నటించారు, వాళ్ళ నటన గురించి ప్రత్యేకించి చెప్పాలిసిన అవసరం లేదు. మీరు ఊహించని కంటెంట్ ని మేము చూపిస్తాము. నిర్మాత మహాదేవ గౌడ్ గారు ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక షెడ్యూల్ ఉంది అనగానే వెంటనే సపోర్ట్ చేసేవారు, చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. ఈ సినిమాని, ఈ బ్యానర్ ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.

తారాగణం:
రామ్ కిరణ్, మేఘా ఆకాష్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, బద్రం .. తదితరులు

సాంకేతిక బృందం:
రచన & దర్శకత్వం: ఉదయ్ శర్మ
నిర్మాత: హెచ్ మహదేవ గౌడ్
సంగీతం: మణి శర్మ
DOP: మధు దాసరి
ఎడిటర్: శశాంక్ మలి
కొరియోగ్రాఫర్: చిన్ని ప్రకాష్, భాను, విజయ్ పొలాకి
సాహిత్యం: అనంత శ్రీరామ్
ఆర్ట్ డైరెక్టర్: P.S. వర్మ
ఫైట్స్: అంజి, కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రోహిత్ కుమార్ పద్మనాభ.
పి ఆర్ ఓ: మధు వి ఆర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

23 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

23 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

24 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago