మార్చి 19, 2026లో రాకింగ్ స్టార్ యష్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ రిలీజ్.. రూమర్స్‌కి చెక్ పెట్టిన మేకర్స్
రాకింగ్ స్టార్ యశ్ హీరో గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘టాక్సిక్’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని హాలీవుడ్ స్థాయికి ధీటుగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనుందంటూ పుకార్లు వచ్చిన నేపథ్యంలో ఫిల్మ్ క్రిటిక్ తరరణ్ ఆదర్శ్ నిర్మాతలను సంప్రదించి విడుదల తేదీపై క్లారిటీ తీసుకున్నారు. ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా రిలీజ్ డేట్‌పై వచ్చిన రూమర్స్‌కి చెక్ పెట్టారు. సినిమా రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదని నిర్మాతలు ప్రకటించినట్లే మార్చి 19, 2026కే విడుదలవుతుందని ప్రకటించారు.
ఏప్రిల్ నెల నుంచి పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా విఎఫ్ఎక్స్ పనులు ప్రారంభమయ్యాయి. మరో వైపు యష్ ముంబైలో రామాయణ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. టాక్సిక్ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వర్క్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమవుతుంద’ని తెలియజేశారు.
ఇంకా 140 రోజులు మాత్రమే ఉన్నాయని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. టాక్సిక్ మూవీ మార్చి 19, 2026లో విడుదలవుతుందని పేర్కొంది
మెయిన్ ఫెస్టివల్స్ సీజన్ సందర్భంగా ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ రిలీజ్ కానుంది. గుడి పడ్వా, ఉగాది సహా ప్రాంతీయ నూతన సంవత్సర వేడుకలు ఒకేసారి వస్తున్నాయి. వీటితో పాటు ఈద్ పండుగ ఉండటం వల్ల ఈ రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర సినిమా భారీ ప్రభావం చూపనుంది. కెజియఫ్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత యష్ నటిస్తోన్న సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ . గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇంగ్లీష్, కన్నడలో తెరకెక్కుతోంది. దీన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
KVN ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్ కె. నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న “టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్”, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఒకేసారి విడుదలవుతూ ఈ పండుగ సీజన్‌ను మరింత ఉత్సాహభరితంగా మార్చేందుకు సిద్ధమవుతోంది.
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…