రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

Must Read

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా నుంచి వ‌స్తోన్న క్రేజీ అప్‌డేట్స్‌తో అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతూ వ‌స్తున్నాయి. తాజాగా ఈ భారీ యాక్షన్ డ్రామాలో రుక్మిణి వసంత్ ను మెలిస్సా పాత్రలో పరిచయం చేస్తూ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ మంగ‌ళ‌వారం రోజున రిలీజ్ చేశారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తుంటే ఆమె  అందంగా, అధికారంతో, ఎలాంటి భయం లేకుండా కనిపించనుందనే పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌నే విష‌యం తెలుస్తోంది.

య‌ష్‌, గీతూ మోహన్ దాస్ కాంబో అనౌన్స్‌మెంట్ రోజు నుంచే అంద‌రిలోనూ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు య‌ష్‌తో క‌లిసి రుక్మిణి వ‌సంత్ న‌టించ‌టంతో ఇదింకా ప్ర‌త్యేక‌తంగా అనిపిస్తోంది. డైరెక్ట‌ర్ గీతు క‌థలో చెప్పాల‌నుకున్న డెప్త్, సీరియ‌స్‌నెస్ అర్థం చేసుకుని త‌న‌దైన న‌ట‌న‌తో భావోద్వేగాల‌ను అద్బుతంగా ప‌లికించేలా స‌హ‌జంగా ఒదిగిపోయే న‌టి రుక్మిణి.  అలాగే అంత‌ర్జాతీయ స్థాయిలో నిలిచిపోయేలా ఓ ఇండియ‌న్ సినిమా చేయాల‌నే య‌ష్ ఆశ‌యం కూడా ఇందులో ప్ర‌తిబింబిస్తుంది.

నాడియాగా కియారా అద్వానీ, ఎలిజిబెత్ పాత్ర‌లో హుమా ఖురేషి, గంగ రోల్‌లో న‌య‌న‌తార‌, రెబెకా క్యారెక్ట‌ర్‌లో తారా సుతారియా న‌టిస్తున్నారు. వీరి పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్స్‌ విడుద‌ల త‌ర్వాత  ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’  నుంచి మెల్లిసా పాత్ర‌లోని రుక్మిణి వ‌సంత్‌ను ప‌రిచ‌యం చేయ‌టం చూస్తే ఈ క‌థాప్ర‌పంచం మ‌రింత డెప్త్‌గా ఉంద‌నే విష‌యం తెలుస్తుంది. 1960 చివ‌ర‌లోజ‌రిగే రంగుల ప్ర‌పంచంలో త‌క్కువ వెలుతురుండే ప్ర‌దేశంలో జ‌రుగుతున్న పార్టీ నేప‌థ్యంలో ఈ సన్నివేశం ఉంటుంది. మెల్లిసా పాత్ర ఆత్మ‌విశ్వాసంతో ఉంటుంది. ఆమె చూపులో ఓ తీక్ష‌ణ‌త‌ను చూడొచ్చు. ఆమె చుట్టూ ఉన్న ప్ర‌పంచం ప‌క్క‌నున్న వారిని ప‌ట్టించుకోకుండా తేలిపోతుంటే, మెల్లిసా మాత్రం త‌న ల‌క్ష్యం వైపు చాలా స్ప‌ష్టంగా అడుగులేస్తుంటుంది. అక్క‌డున్న వారంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా ఆమె న‌డ‌క ఉంది. ఇది ఎంత బావుంటుందంటే.. ఆ ప్ర‌దేశమంతా ఆమె ఆధీనంలోనే ఉన్నంత‌గా.

సినిమాలోని ప్ర‌తి పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌టం ద్వారా సినిమా బావోద్వేగాల ప‌రిధి, సినిమాటిక్ స్థాయిని టాక్సిక్ విస్తరిస్తోంది. అందువ‌ల్ల ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో త‌న స్థానాన్ని నిలుపుకుంది.

ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్ మాట్లాడుతూ ‘‘రుక్మిణిలో నాకు నచ్చే విషయమేమంటే.. నటిగా డైరెక్టర్ చెప్పింది చేస్తే చాలని ఆలోచించే వ్య‌క్తి కాదు. చాలా తెలివైన‌ది. పాత్ర‌ను అర్థం చేసుకుంటుంది. పాత్ర గురించి ఆమె వేసే ప్ర‌శ్న‌లు చాలా ఆస‌క్తిని క‌లిగిస్తాయి. డైరెక్ట‌ర్‌గా అవి న‌న్నెంతో ఆలోచింప‌చేశాయి. కొన్ని సంద‌ర్భాల్లో నా నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నించుకునేలా చేశాయి. ఆమె న‌టిస్తున్న‌ప్పుడు స్క్రీన్‌ను చూస్తే ఆమె ఎంత తెలివైన‌ది.. మ‌నం చెప్ప‌ని విష‌యాల‌ను కూడా ఇంప్రవైజ్ చేసి చెబుతుంద‌నిపిస్తుంది. షూటింగ్ షాట్స్ గ్యాప్‌లో ఆమె నిశ్శబ్దంగా తన జర్నల్‌లో రాసుకోవ‌టాన్ని నేను చాలా సార్లు చూశాను. సెట్‌లో జరిగిన చిన్న సంఘటనలు, తన ఆలోచనలను ఆమె అందులో రాసుకుంటుంటుంది. ఇదే ఆమె యాక్టింగ్ వెనుకున్న ర‌హ‌స్య‌మ‌ని తెలుస్తుంది. ఆమె త‌న‌తో తాను ఓ లోకాన్ని నిర్మించుకుంటూ ఉంటుంది. ఆమె ప‌ని చేసే తీరు ఆలోచ‌నాత్మ‌కంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆమె జ‌ర్న‌ల్‌లో పేజీలను మ‌నం ఒక్క‌సారి చ‌దివితే బావుండేద‌నిపిస్తుంది. ఎందుకంటే ఆమె న‌ట‌న‌లోని డెప్త్.. ఆపాత్ర వెనుకున్న భావాన్ని అర్థం చేసుకోవాల‌నే ఆస‌క్తి అందులోనుంచి వ‌చ్చిందే’’ అన్నారు.

యష్, గీతూ మోహన్‌దాస్ కలిసి కథను రాసి.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచ‌నాలున్నాయి. అద్భుత‌మైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వ‌ర్క్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను నేషనల్ అవార్డు గ్రహీత రాజీవ్ రవి నిర్వహిస్తుండగా.. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. ఎడిటింగ్‌ను ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైన్‌ను టీపీ అబీద్ చూసుకుంటున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ (జాన్ విక్ ఫేమ్)తో పాటు నేషనల్ అవార్డు గెలుచుకున్న అన్బరివ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేశారు.

‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై వెంక‌ట్ కె.నారాయ‌ణ‌, య‌ష్ నిర్మిస్తున్నారు. సినిమా 2026 మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్ వీకెండ్‌ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News