రోటీ కప్డా రొమాన్స్” నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్.

నవంబరు 28న రోటి కపడా రొమాన్స్‌ గ్రాండ్‌ విడుదల.. ఈ నెల 22 నుంచి గ్రాండ్‌ ప్రీమియర్స్‌
హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. తొలుత ఈ చిత్రాన్ని నవంబరు 22న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు

చేసుకున్నారు మేకర్స్‌. అయితే ఓ మంచి చిత్రం చిత్రం అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్‌ చేయాలనే సంకల్పంతో, థియేటర్స్‌ దొరకని కారణంగా చిత్రాన్ని ఈ నెల 28న మాసివ్‌ గ్రాండ్‌ రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాతలు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ”యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా, నేటి యూత్‌ను ఆకట్టుకునే అంశాలుతో రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేస్తున్నాం. ఈ నెల 22 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో పెయిడ్‌ ప్రీమియర్స్‌ ప్లాన్‌ చేస్తున్నాం. ఇటీవల కొంత మంది సగటు ప్రేక్షకులకు, యూత్‌కు సినిమాను ప్రదర్శించాం.

అందరికి నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. బుధవారం మీడియాకు వేసిన షోకు కూడా మంచి స్పందన వస్తోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీని చూడలేదు అని వాళ్లు ప్రశంసిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఓ మంచి చిత్రం అందరికి చేరువ కావాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని ఈ నెల 28న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. ముఖ్యంగా ఆల్‌రెడీ ఈ చిత్రానికి క్రిటిక్స్‌ నుండి మంచి రివ్యూలు వస్తున్నాయి. దీంతో మా చిత్ర విజయంపై మరింత నమ్మకం పెరిగింది. తప్పకుండా ఈ చిత్రం 2024లో విడుదలైన చిత్రాల్లో ఉత్తమ ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా నిలుస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

12 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

12 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

12 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago