నవంబరు 28న రోటి కపడా రొమాన్స్ గ్రాండ్ విడుదల.. ఈ నెల 22 నుంచి గ్రాండ్ ప్రీమియర్స్
హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. తొలుత ఈ చిత్రాన్ని నవంబరు 22న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు
చేసుకున్నారు మేకర్స్. అయితే ఓ మంచి చిత్రం చిత్రం అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాలనే సంకల్పంతో, థియేటర్స్ దొరకని కారణంగా చిత్రాన్ని ఈ నెల 28న మాసివ్ గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ”యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా, నేటి యూత్‌ను ఆకట్టుకునే అంశాలుతో రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేస్తున్నాం. ఈ నెల 22 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. ఇటీవల కొంత మంది సగటు ప్రేక్షకులకు, యూత్‌కు సినిమాను ప్రదర్శించాం.
అందరికి నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. బుధవారం మీడియాకు వేసిన షోకు కూడా మంచి స్పందన వస్తోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీని చూడలేదు అని వాళ్లు ప్రశంసిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఓ మంచి చిత్రం అందరికి చేరువ కావాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని ఈ నెల 28న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. ముఖ్యంగా ఆల్‌రెడీ ఈ చిత్రానికి క్రిటిక్స్ నుండి మంచి రివ్యూలు వస్తున్నాయి. దీంతో మా చిత్ర విజయంపై మరింత నమ్మకం పెరిగింది. తప్పకుండా ఈ చిత్రం 2024లో విడుదలైన చిత్రాల్లో ఉత్తమ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా నిలుస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు.
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’,…
హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ…
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని.…
పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో కొత్త ఫీచర్ ఫిల్మ్‌ను ఎస్ కే…
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న…