టాలీవుడ్

ఈ నెల 14న ‘రోలుగుంట సూరి’ విడుదల

హైదరాబాద్: తెలుగు తెరపైకి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన మూవీ ‘రోలుగుంట సూరి’. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలప్ హీరోహీరోయిన్లుగా తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌమ్య చాందిని పల్లా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ తెలుగు ఫిలింఛాంబర్ లో ప్రీ రిలీజ్ కార్యకమాన్ని నిర్వహించింది.

దర్శకుడు అనిల్ కుమార్ పల్లా మాట్లాడుతూ – “ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రియల్ స్టిక్ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో సినిమాను అద్భుతంగా చేశారని అభినందించడం మా చిత్ర యూనిట్ కు కొత్త ఎనర్జీ వచ్చింది. మ్యూజిక్ పై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ గారు లాంచ్ చేసిన మా సినిమాలోని పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనూప్ రూబెన్స్ గారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము. మా కృషిని, మా టీం టాలెంట్‌ను ఆయన ప్ర‌త్యేకంగా అభినందించ‌డం ఎంతో సంతోషంగా ఉంది. ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ మా సినిమా టీమ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రేక్షకులకు ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని భరోసా ఇచ్చారు. ఇక మా సినిమా హీరో నాగార్జున పల్లా అథ్లెటిక్స్ లో నేషనల్ గోల్డ్ మేడలిస్ట్. సినిమా రంగంలో మంచి ఫ్యూచర్ ఉందని మా సినిమాలో యాక్టింగ్ టాలెంట్ తో నిరూపించుకున్నాడు. ఈ నెల 14న విడుదల అయ్యే ‘రోలుగుంట సూరి’ సినిమాను థియేటర్ కు వెళ్లి చూడాలని ప్రతీ ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను” అని అన్నారు.

హీరో నాగార్జున పల్లా మాట్లాడుతూ.. “నాకు ఇది ఫస్ట్ మూవీ. నేను స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచి వచ్చాను. చాలా ఇష్టపడి చేశాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇదే టీంతో మరో ప్రాజెక్టు చేయడానికి సిద్ధమవ్వడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ థియేటర్ కు వెళ్లి సినిమా చూసి మాకు బ్లేసింగ్స్ ఇవ్వండి. ” అని కోరారు.

నిర్మాత సౌమ్య చాందిని పల్లా మాట్లాడుతూ –
“’రోలుగుంట సూరి’ ఒక రియలిస్టిక్ విలేజ్ డ్రామా. భావోద్వేగాలతో, జీవిత సత్యాలతో మిళితమైంది. చిత్ర‌యూనిట్‌లోని ప్ర‌తి స‌భ్యుడు టాలెంట్ చూపించారు. సినిమా బాగా వచ్చింది. ఈ నెల 14న థియేటర్ కు వెళ్లి సినిమా చూసి హిట్ చేయాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాను.” అని తెలిపారు.

లిరిక్ రైటర్ రామారావు మాతుమూరు మాట్లాడుతూ… “ఈ మూవీ లో ప్రణయ విరహ గీతం “నిన్న.. మొన్న..” అనే పాట రాసాను. ఈ పాటను అనూప్ రూబెన్స్ విడుదల చేసి అభినందించడం ఆనందంగా ఉంది. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు ఈ పాటను ప్రత్యేకంగా ప్రశంసించడం మర్చిపోలేని అనుభూతి.” అని అన్నారు.

తెలుగులో ఒక అరుదైన‌, అద్భుత‌మైన సినిమాగా ‘రోలుగుంట సూరి’ నిలిచిపోవ‌డం ఖాయ‌మ‌ని చిత్ర‌ యూనిట్ సభ్యులు న‌మ్మ‌కం వ్య‌క్తం చేశారు.

సాంకేతిక విభాగం:
నటీనటులు: నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలప్, బ్రహ్మనందరెడ్డి, సత్యనారాయణ, ఆయుషా, జ్యోతి, మహర్షి రమణ, ముకుందం శ్రీను చొప్ప త‌దిత‌రులు
నిర్మాత: సౌమ్య చాందిని పల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఊరికూటి తాతారావు, పల్లా సత్యనారాయణ
దర్శకుడు: అనిల్ కుమార్ పల్లా
సంగీతం: సుభాష్ ఆనంద్
లిరిక్: రామారావు మాతుమూరు
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: సందీప్ చక్రవర్తి
ఎడిటింగ్ , ఆడిషనల్ స్క్రీన్ ప్లే : ఆవుల వెంకటేష్
కథ, డైలాగ్స్: మహ్మద్ సాయి
ఫైట్స్: వాసు
ఆర్ట్ డైరెక్టర్: ఎస్. రమేష్
కో-డైరెక్టర్: సుభాష్
పబ్లిసిటీ డిజైన్: ఇమేజ్ 7 అడ్వర్టైజింగ్

పీఆర్వో: క‌డ‌లి రాంబాబు, ద‌య్యాల అశోక్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

2 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago