‘అనంత’ఆడియో& టీజర్ లాంచ్ ఈవెంట్

కమర్షియల్ సినిమాల్లో బాషా ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో డివైన్ ఫిలిమ్స్ లో ‘అనంత’ అలాంటి ట్రెండ్ సెట్ చేస్తుంది: ఆడియో& టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ సురేష్ కృష్ణ

జగపతి బాబు, సుహాసిని ప్రధాన పాత్రల్లో వెటరన్ డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన డిఫైన్ ఫిల్మ్ అనంత. ఇన్నర్ వ్యూ బ్యానర్ పై గిరీష్ కృష్ణమూర్తి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో& టీజర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ఆడియో& టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్  సురేష్ కృష్ణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఎన్నో ఏళ్లుగా నేను సినిమాలు చేస్తున్నాను. ఎంతోమంది ఎన్నో రకాలుగా నన్ను గుర్తిస్తున్నారు. గౌరవిస్తున్నారు. ఇంతకాలం నేను ఏం పొందాను అని ఆలోచిస్తుంటే ప్రేమని పొందాను, ప్రేమను పంచాను అనిపించింది. ఒక్క ఫోన్ కాల్ లో మీరంతా వచ్చారు. అది ప్రేమ. ఈ సినిమా కూడా ఆ ప్రేమతోనే వచ్చింది. బాబా గారి గురించి ఒక బయోపిక్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఆయన ఆశ్రమం కి వెళ్ళాను. ఆయన నన్ను చూసి ‘ఇంతకాలం ఎందుకు రాలేదు’ అని అడిగారు. నేను ఆయన కాళ్ళకి నమస్కరించాను. అది నా మనసుని ఎంతో కదిలించింది. 2011లో ఆయన చనిపోయారు. తర్వాత నేను నా రొటీన్ లో పడిపోయా. గత ఏడాది జూన్లో ఒక కల వచ్చింది. ఆయన కలలోకి వచ్చి విభూదిని ఇచ్చా. బాబా గారి దగ్గరికి నన్ను మొదటిసారి తీసుకెళ్లిన వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు ఆయన మేము పుట్టపర్తి లో ఉన్నాం మీ గురించి మాట్లాడుకున్నామని చెప్పారు. ఒకరోజు గిరీష్ కృష్ణమూర్తి గారు ఫోన్ చేసి బాబా గారి జీవితం పై సినిమా చేయాలని చెప్పారు. నేనే ఎందుకు ఈ సినిమా డైరెక్టర్ చేయాలని అడిగినప్పుడు.. బాబా గారు కలలోకి వచ్చి మిమ్మల్ని డైరెక్ట్ చేయమని చెప్పారు అన్నారు. బాబాగారి శత జయంతి సందర్భంగా ఈ సినిమా చేయాలని కోరారు. కానీ ఆ సినిమాలో బాబాలాగా ఎవరూ నటించకూడదన్నారు. అప్పుడు నా దగ్గర స్క్రిప్ట్ కూడా లేదు. అనుకోకుండా ఒక మంచి స్క్రిప్ట్ వచ్చింది. ఏదో భక్తి సినిమాలా కాదు. బాషా సినిమా లాంటి కమర్షియల్ స్క్రిప్ట్ వచ్చింది. జగపతిబాబు గారికి సినిమా గురించి చెప్పినప్పుడు ఆయనకు  చాలా నచ్చింది. అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆయన డైలాగ్ డెలివరీ చూసినప్పుడు సూపర్ గా అనిపించింది. సుహాసిని గారు చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. అందరూ కూడా  అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. దేవా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. శాస్త్రి గారు రాసిన పాట అద్భుతంగా వచ్చింది. కాశీ, చెన్నై, హైదరాబాద్, పుట్టపర్తి  ఇలా అద్భుతమైన లొకేషన్స్ లో సినిమాని షూట్ చేశాం. ఇది  మామూలు డివైన్ లాగా ఉండదు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బాబా గారికి ప్రేమే మతం. కమర్షియల్ సినిమాస్ లో బాషా ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో డివైన్ ఫిలిమ్స్ లో అనంత అలాంటి ట్రెండ్ సెట్ చేస్తుంది. ఈ సినిమా తర్వాత బాబా గారి ప్రేమ తత్వం మరింత మందికి చేరువవుతుంది.

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సురేష్ కృష్ణ గారు గొప్ప దర్శకులు. సినిమా అంటే ఎంతో ప్రేమ. ఆయన ఎప్పుడూ కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అనంత సినిమాతో వస్తున్నారు. సాయిబాబా తనని నమ్మిన వారందరిని ప్రేమించాడు. నమ్మినా నమ్మకపోయినా ఆయన సేవలు అందించారు. విద్య వైద్యం నీరు ఆయన పరిధిలో చేయగలిగినంత చేశారు   సురేష్ కృష్ణ ఎప్పుడు కూడా మంచి సినిమా తీస్తాడు. ఈ సినిమా కూడా అందరూ చూడాలని చూస్తారని కోరుకుంటున్నాను.

సాయి మాధవ్ బుర్ర మాట్లాడుతూ.. అందరికి సురేష్ కృష్ణ గారి వేడుకలో నేను భాగం అవ్వడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇండియన్ సినిమా బిఫోర్ బాషా ఆఫ్టర్ బాషా. అలాంటి సినిమా ఇచ్చిన డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు.  అనంత సినిమాని జనాలకి చూపించాలని గొప్ప ఉద్దేశంతో అంకిత భావంతో తీసిన సినిమా. సత్య సాయి బాబా గారి ప్రేమతత్త్వం అందరికీ పంచాలనే మనస్తత్వం ఉంటే తప్పితే ఇలాంటి సినిమా చేయలేం. ఇలాంటి సినిమాలు కి మీడియా మిత్రులు కూడా మరింత సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అందరూ చూసే సినిమా ఇది. ఆధ్యాత్మికత చాలా అవసరం. మనిషికి భయం భక్తి రెండు ఉండాలి. పాపభీతి ఉండాలి. భక్తి భావం అందరిలోనూ ప్రచారం అవ్వాలి. ఈ సినిమా కమర్షియల్ కూడా అద్భుతమైన విజయం సాధించి మరిన్ని సినిమాలు రావడానికి ఇన్స్పిరేషన్ గా నిలవాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ వీర శంకర్ మాట్లాడుతూ..  అందరికి నమస్కారం. సురేష్ కృష్ణ గారు ఐకానిక్ డైరెక్టర్. ఆయన అన్ని భాషల్లో సినిమాలు చేశారు. ఆహా సినిమా చేసినప్పుడు ఆయనని క్లోజ్ గా చూడడం జరిగింది. ఆయన చూసినప్పుడు డైరెక్టర్స్ ఉంటే ఇంత క్లాస్ గా ఉండాలి అనిపించేది. భక్తి ప్రేమతో ప్రపంచాన్ని తన వైపుకు తీసుకొచ్చిన బాబా గారి నేపథ్యంలో ఈ సినిమా చేయడం అనేది గొప్ప విషయం. ఈ సందేశం ప్రేక్షకులు అందరికీ చేరి ఎంతో మంది స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నాను. సురేష్ కృష్ణ గారు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను

రాకేందు మౌళి మాట్లాడుతూ… అందరికి నమస్కారం. శాస్త్రి గారు అద్భుతమైన పాట రాశారు. డైరెక్టర్ సురేష్ కృష్ణ గారి గురించి చెప్పేంత అనుభవం వయసు నాకు లేదు. ఆయన సినిమాలన్నీ థియేటర్లో చూశాను. సురేష్ గారు మా నాన్నగారు కలిసి పనిచేశారు. అలాంటి ఆయనతో కలిసి వర్క్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అందరిపై గురు కృప ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఒక గొప్ప సినిమా చూసిన అనుభూతి కలిగించే సినిమా ఇది.

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాతో బాబా ప్రేమ సందేశం మరింత మందికి చేరువవుతుంది. ఎందుకంటే సంకల్పం అంత గొప్పది. ఇంత మంచి ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన పాట రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. బాబా గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా తీసిన సినిమా ఇది.తప్పకుండ అందరికీ నచ్చుతుంది.

శ్రీ రజిని మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఈ సినిమాలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అనంత  టీజర్  సాంగ్స్ చూస్తున్నప్పుడు చాలా గొప్ప అనుభూతి కలిగింది.  సురేష్ కృష్ణ గారికి ధన్యవాదాలు. ఇదంతా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.  

చోటా కె నాయుడు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సురేష్ కృష్ణ గారంటే నాకెంతో గౌరవం. దాసరిగారి తర్వాత నాకు మరో గురువు. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన ఒక గొప్ప వ్యక్తి మీద సినిమా చేశారు. సురేష్ గారు ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆ సినిమాలన్నీ వేరు ఈ సినిమా వేరు. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

6 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago