“స్వాగ్” సినిమాలో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంటున్న రీతు వర్మ

Must Read

అందం, ప్రతిభ గల అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్ లో ఒకరు రీతు వర్మ. ఆమె తన రీసెంట్ రిలీజ్ “స్వాగ్” తో మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసి తన నటనతో మెప్పిస్తోంది రీతు వర్మ. పురుషాధిక్యాన్ని వ్యతిరేకించే వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి, అన్యాయాన్ని ఎదిరించే సివిల్ ఇంజినీర్ అనుభూతి పాత్రల్లో రీతు వర్మ సూపర్బ్ పర్ ఫార్మెన్స్ చేసింది. స్వాగ్ సినిమా గురించి మాట్లాడేవారు రీతు వర్మ పర్ ఫార్మెన్స్ గురించి తప్పక చెబుతున్నారు. రీతు వర్మ నటన హైలైట్ గా నిలుస్తోందనే ప్రశంసలు వస్తున్నాయి.

స్వాగ్ సినిమాలోని క్యారెక్టర్స్ ను ఛాలెంజింగ్ తీసుకుని నటించింది రీతు వర్మ. ప్రస్తుతం రీతు వర్మ తెలుగుతో పాటు తమిళంలోనూ పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. హాట్ స్టార్ కోసం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. రీతు వర్మకు ఈ సిరీస్ డిజిటల్ ఎంట్రీ కానుంది.

Latest News

శ్రీరామ్‌ ‘ది మేజ్‌’ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌ విడుదల

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్‌. ఈయన తమిళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో...

More News