‘మకుటం’ నుంచి విశాల్ పాడిన ‘రైజ్ ఆఫ్ లింగా’ పాట విడుదల

వెర్సటైల్ హీరో విశాల్ ప్రస్తుతం ‘మకుటం’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీతో విశాల్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ ప్రాజెక్ట్‌కి రవి అరుసు కథను అందించారు. విశాల్ 35వ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ ‘మకుటం’ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. విశాల్‌ సరసన ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ నటిస్తున్నారు. ఇప్పటి వరకు ‘మకుటం’ నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి.

విశాల్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతోన్నారు. తాజాగా విశాల్ ఈ సినిమాలో లింగా అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోన్నారు. ఈ మేరకు ‘రైజ్ ఆఫ్ లింగా’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను చూస్తుంటే సినిమాలో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతోన్నట్టుగా తెలుస్తోంది. ‘రైజ్ ఆఫ్ లింగా’ పాటని విశాల్, జీవీ ప్రకాష్ సంయుక్తంగా ఆలపించారు. ఇక ఈ పాట ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్‌గా రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. జూలైలో మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తోంది.

‘మకుటం’ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

తారాగణం : విశాల్, దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు

సాంకేతిక సిబ్బంది:

నిర్మాణ సంస్థ: సూపర్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాత: ఆర్‌బి చౌదరి
దర్శకుడు: రవి అరసు
సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ఎం. నాథన్
ఎడిటర్: ఎన్‌బి శ్రీకాంత్
కళా దర్శకుడు: జి. దురైరాజ్
కాస్ట్యూమ్ డిజైనర్: వాసుకి భాస్కర్
పీఆర్వో : సాయి సతీష్

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

4 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

4 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

4 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago