విప్లవ కవి గద్దర్ గారు నటించిన ఆఖరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’ ఈనెల 29న 300 కు పైగా థియేటర్లలో బ్రహ్మాండమైన విడుదల – ఢిల్లీ ఏపీ భవన్ లో ప్రస్తావించిన సత్యారెడ్డి

Must Read

విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత, హీరో, జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం,”ఉక్కు సత్యాగ్రహం”. గద్దరన్న మూడు పాటలు పాడి రెండు పాటల్లో మరియు కొన్ని సందేశాత్మక సీన్స్ లో నటించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు. ఇప్పుడు ఈ సినిమాని ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నారు.

ఈసందర్బంగా చిత్ర దర్శక, నిర్మాత, కథానాయకుడు సత్యారెడ్డి మాట్లాడుతు : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది ప్రాణత్యాగాల తో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా, ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ అన్న నటించిన ఆఖరి చిత్రం గా ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాను నిర్మించాను. ఈ సినిమాలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోని అన్ని కార్మిక సంఘాలు, సంఘ నాయకులు, భూ నిర్వాసితులు నటించారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సినిమాను నిర్మించామని సెన్సార్ లేట్ అవ్వడం వల్ల మరియు గద్దర్ గారి మరణం వలన ఈ సినిమా ఇన్ని రోజులు వాయిదా పడింది. కానీ ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని 300కు పైగా థియేటర్లలో ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నాం. ఈ కాలంలో విప్లవానికి సంబంధించిన సినిమాలు తీయడం చాలా కష్టం. సెన్సార్ ఆపేస్తారు సినిమాని విడుదలకుండా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆగకుండా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా విజయాన్ని సాధించిన కారణంగా ఈ సినిమాని ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. విప్లవ గీతాలతో కొట్లాదిమందిని విప్లవం వైపు నడిపించిన విప్లవ కవి గద్దర్ గారు నటించిన ఆఖరి చిత్రం.

ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా వచ్చినప్పుడు ఏం జరిగింది? అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ను మద్రాస్ లో పెట్టాలి అని ఇందిరాగాంధీ గారు అనుకున్నప్పుడు ఏం జరిగింది? అనేది చాలా చక్కగా ఈ కథను గద్దర్ గారే రాశారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు రాసి కొన్ని కీలక సన్నివేశాల్లో నటించారు. తన వారసులు ఎలా ఉండాలి ఉద్యమాలు ఎలా నిర్మించాలి అనేది కూడా ఆయన చనిపోయే ముందు రాసుకున్న చివరి పాట. ఉద్యమకారులు, గద్దర్ గారి అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు :
గద్దర్ గారు, సత్యా రెడ్డి, ‘పల్సర్ బైక్’ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు, ఎం వి వి సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల.

సాంకేతిక నిపుణులు:
సంగీతం : శ్రీకోటి
ఎడిటర్ : మేనగ శ్రీను
ప్రొడక్షన్ : జనం ఎంటర్టైన్మెంట్స్
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత మరియు దర్శకత్వం : పి. సత్యా రెడ్డి
పి ఆర్ ఓ : మధు VR

Latest News

Nuvvu Gudhithe lyrical song from Drinker Sai

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline Brand of Bad Boys....

More News