కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి లేటెస్ట్ కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో పోషించారు. అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, విమర్శకులు ప్రశంసలు అందుకొని కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా ఆడియన్స్ విక్టరీ శ్వాగ్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఆడియన్స్ విక్టరీ శ్వాగ్ సక్సెస్ మీట్ లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారికి, నాకోసం ఇలాంటి మంచి కథ రాసిన హసిత్ గోలికి, సినిమా కోసం పనిచేసిన టీంలో ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. రీతు వర్మ, దక్ష, మీరాజాస్మిన్, సునీల్ గారు అందరూ చాలా అద్భుతంగా చేశారు. కొన్ని సినిమాలు బాగున్నాయి అనిపిస్తాయి. ఇంకొన్ని సినిమాలు అంత లేదులే అనిపిస్తాయి. కానీ కొన్ని సినిమాలు చూసి వచ్చిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతాయి. దాని గురించి ఒక డిస్కషన్ జరిగేలా చేస్తాయి. అలాంటి సినిమానే స్వాగ్. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. డిస్కషన్స్ నుంచి చాలా వాలిడ్ పాయింట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మేము ఫస్ట్ డే నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. సినిమా చూసినోళ్లు 90% సాటిస్ఫై అయ్యారు. 10% కొంచెం కాంప్లెక్స్ ఉంది అని ఫీల్ అయ్యారని హసిత్ చెప్పాడు. కొత్తగా ఏదైనా ప్రయత్నించినప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. శ్వాగ్ సినిమాని ఎవ్వరూ కూడా బాలేదని అనలేదు. దానికి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను చేసిన చాలా సినిమాలు కి ఇప్పటికీ ప్రశంసలు వస్తుంటాయి. ఆ సినిమా ప్రశంసలు ఆగిపోయి, ఈ సినిమా ప్రశంసలు మొదలవుతాయని ఆశిస్తున్నాను. ఈ ప్రశంసలు కొనసాగుతూనే ఉంటాయని నమ్ముతున్నాను. ఈ సినిమా చూసే కొద్ది కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో అర్థం అవుతుంది. మమ్మల్ని గెలిపించిన తెలుగు ప్రేక్షకుల్ని గెలిపించడానికి ఈ సినిమా చేస్తున్నానని మొదటి నుంచి చెప్తున్నాను. నిజంగానే మీరంతా గెలిచారు. మీరు గెలిచి మమ్మల్ని గెలిపించారు. ఇలాంటి రిస్కులు, కొత్త కథలు ట్రై చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ ని మనం ఇన్ స్పైర్ చేయలేం. ఏమీ లేని నాకు ఇంత గుర్తింపు ఇచ్చారు. తెలుగు ఆడియన్స్ రుణం తీర్చుకోవాలి. ఆ రుణం తీర్చే ప్రాసెస్లో ఇలాంటి గొప్ప కథలు చేయడానికి ప్రయత్నిస్తుంటాను. హసిత్ నా ఫ్యాన్. నాకు ఒక తమ్ముడిలా. నాకు ఇంత మంచి కథ, పాత్రలు రాసినందుకు థాంక్యూ. ఆడియన్స్ నేను చేసిన ప్రతి క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈసారి రాస్తే దీన్ని కొట్టేది రాయాలి. రాస్తాడనే నమ్మకం కూడా ఉంది. విశ్వ గారు మాకు ఇంత ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఇలాంటి కథను చేయలేం. పీపుల్ మీడియా టీమ్ అందరికీ థాంక్యు. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లి మీడియా మిత్రులు అందరికీ థాంక్యూ. ఆ 10% కూడా కంగారు పడకండి. నెక్స్ట్ సినిమాకి వడ్డీతో సహా ఇచ్చేస్తాను. లేకపోతే లావు అయిపోతాను (నవ్వుతూ) అందరికీ థాంక్యూ’ అన్నారు
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. శ్వాగ్ ని ఇంత అద్భుతంగా ఆదరించిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ. సినిమాని చక్కగా ప్రమోట్ చేసిన మీడియాకి థాంక్యూ. నేను టీజర్ లాంచ్ ఈవెంట్ లోనే శ్రీ విష్ణు ని కమల్ హాసన్ గారితో పోల్చడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాను. ఇంద్రుడు చంద్రుడు, మైఖేల్ మదన్ కామరాజు, భామనే సత్యభామనే సినిమాల్లో కమలహాసన్ గారు చేసింది మనం ఒక్క సినిమాలో చూడచ్చని చెప్పాను. ఈ సినిమా కంటెంట్ విషయంలో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. హసిత్ శ్రీ విష్ణు చాలా వర్క్ చేశారు. శ్రీ విష్ణు తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అలాగే హసిత్ నెక్స్ట్ ఇయర్ మరో మూవీ చేయబోతున్నాం’అన్నారు.
హీరోయిన్ దక్ష నాగర్కర్ మాట్లాడుతూ.. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ హసిత్ గారికి, ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి, నా క్యారెక్టర్ ని ఇంత అద్భుతంగా చేయడానికి సపోర్ట్ చేసిన హీరో శ్రీ విష్ణు గారికి థాంక్యూ. ఈ సినిమా కోసం సక్సెస్ టూర్ కి వెళ్లాం. సినిమాని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్నందుకు ప్రేమిస్తున్నందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా ఆడియన్స్ విక్టరీ. నన్ను ఇంతగా ఆదరించినందుకు థాంక్యూ. ఇంత మంచి హిట్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ. మరిన్ని మంచి కథలు, పాత్రలు తో మీ ముందుకు వస్తాను’అన్నారు
డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ తో మేము ఈ సినిమా గురించి పడిన రెండున్నర ఏళ్ల కష్టాన్ని మర్చిపోయాం. మీడియా, ఆడియన్స్ నుంచి వచ్చిన ఇంత అద్భుతమైన స్పందన నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఆడియన్స్ కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన హీరో శ్రీ విష్ణు గారికి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమాని రాస్తున్నప్పుడు గానీ తీస్తున్నప్పుడు గానీ బోల్డ్ కంటెంట్ అని అనుకోలేదు. కానీ చూసిన ఆడియన్స్ బోల్డ్ కంటెంట్ అని చెప్పడం చాలా కిక్ ఇచ్చింది. ‘శ్రీ విష్ణు ది గ్రేటెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది డెకేడ్’ అనే ప్రశంసలు వింటున్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. గూప్స్ బంప్స్ వస్తున్నాయి. నేను శ్రీ విష్ణు ఫ్యాన్ ని. ఆయన గ్రేటెస్ట్ పెర్ఫార్మర్. ఈ సినిమాతో ఆయన యాక్టింగ్ ని మరింత ఎక్స్ ఫ్లోర్ చేసే అవకాశం నాకు దక్కడం ఆనందంగా ఉంది. ఈ కథని నా టీం నమ్మకపోతే ఇంత అద్భుతంగా చేసే వాడిని కాదు. నా డైరెక్షన్ టీమ్ అందరికీ థాంక్యు. ఆడియన్స్ మనందరికంటే స్మార్ట్. థియేటర్స్ టూర్ కి వెళ్ళినప్పుడు ఏలూరు లాంటి ప్రాంతంలో ఫ్రంట్ లో కూర్చున్న ఆడియన్స్ శ్వాగనిక అని పలుకుతున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. స్మార్ట్ నెస్ అనేది ఆడియన్స్ లో ఉన్నప్పుడే ఇలాంటి రెఫ్లెక్టివ్ కంటెంట్ వస్తుంది. దానికి మేము మర్యాద ఇచ్చామని అనుకుంటున్నాం. అందుకే ఈ ఈవెంట్ కి ‘ఆడియన్స్ విక్టరీ’ అని పేరు పెట్టాం. ఆడియన్స్ గెలవాలని విష్ణు గారు ఈ సినిమా చేశారు. వాళ్ళే గెలిచారు. అదే మాకు ఆనందం. ఈ జర్నీలో నాకు సపోర్టుగా ఉన్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. విష్ణు గారితో విశ్వ గారితో ఈ జర్నీ కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ఆడియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆడియన్స్ లేకపోతే ఈ సినిమా లేదు. సినిమా హౌస్ ఫుల్ గా రన్ అచుతుంది. ఈ సక్సెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది’అన్నారు.
ఎడిటర్ విప్లవ్ మాట్లాడుతూ.. ఆడియన్స్ కల్మషం లేని వ్యక్తులు. సినిమా చూసి పదిమందికి చెప్పి మరో పదిమందికి రీచ్ అయ్యేలా చేసేది ఆడియన్స్. ఈ సందర్భంగా ఆడియన్స్ కి థాంక్యూ. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చాలా బాగుందని, గుర్తుండిపోయే సినిమా అని చెబుతున్నారు. ఇది ట్రూలి ఆడియన్స్ విక్టరీ. హసిత్ చాలా కాంప్లెక్స్ స్టోరీని చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశాడు. శ్రీ విష్ణు గారి మల్టిపుల్ క్యారెక్టర్స్, పెర్ఫార్మెన్స్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి బ్యూటిఫుల్ సినిమాని నిర్మించిన నిర్మాత విశ్వ ప్రసాద్ గారికి థాంక్యూ. సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా థాంక్యూ’ అన్నారు. మూవీ టీం అంతా పాల్గొన్న ఈ సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ "క" బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా…
Young hero Kiran Abbavaram’s latest film KA is creating a huge buzz at the box…
Hombale Films and Prabhas all set to join forces for three mega films, set to…
డెర్మటాలజీ అండ్ కాస్మటాలజీ పట్ల అవగాహన పెరుగుతున్న తరుణంలో అందుకు అవసరమైన అత్యాధునిక వసతులతో క్లినిక్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బంజారాహిల్స్…
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు…
Star hero Suriya is starring in the prestigious film Kanguva, a massive period action movie…