వీక్షణం సినిమా ప్రీమియర్ షోలకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది ఆ వివరాల్లోకి వెళితే.. రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి రూపొందిస్తున్నారు. “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమాను స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ప్రదర్శించారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ ప్రీమియర్స్ అన్ని హౌస్ ఫుల్ అవ్వడం గమనార్హం.
ప్రీమియర్స్లో సినిమాకి మంచి పాజిటివ్ టాక్ లభించింది. సినిమాలోని ట్విస్టులు అసలు ఊహకు అందేలా లేవని దర్శకుడికి ఇది మొదటి సినిమా లాగా ఏమాత్రం అనిపించడం లేదని సినిమా చూసినవారు అంటున్నారు. అలాగే సంగీత దర్శకుడు సాయి సమర్థ ఇచ్చిన మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు ప్రీమియర్స్ వేయడం పెద్ద సాహసంగా చెప్పాలి. ఎందుకంటే ప్రీమియర్స్ వేసినప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు రాకపోతే అక్కడే సినిమాకి ఇబ్బందికర పరిస్తితులు ఏర్పడతాయి. కానీ ఈ సినిమాకి మాత్రం ప్రేక్షకులే ఆసక్తి కనబరిచి టికెట్లు బుక్ చేసుకుని ధియేటర్లకు రావడం గమనార్హం.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన…
తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…
ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…
అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…