ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్, ఛార్మి కౌర్, పూరీ కనెక్ట్స్ ‘డబుల్ ఇస్మార్ట్’ రెగ్యులర్ షూటింగ్ ముంబైలో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ప్రారంభం
ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’ లో తన పాత్ర కోసం రామ్ మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ట్రాన్స్ ఫర్మేషన్ చూపించే వీడియోలో సూపర్ స్మార్ట్ గా కనిపించారు రామ్. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాధ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విషు రెడ్డి సీఈవో.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. భారీ సెట్ లో రామ్, ఫైటర్స్‌పై భారీ సీక్వెన్స్ తో టీమ్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించింది. ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రం నుంచి పూరీ జగన్నాధ్ తో అసోసియేట్ అవుతున్న స్టంట్ డైరెక్టర్ కేచ ఈ సీక్వెన్స్ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు.
వర్కింగ్ స్టిల్‌లో రామ్, చేతిలో ఫైర్ వర్క్స్ పట్టుకుని ట్రక్కులో కూర్చొని కనిపించారు. పూరి, కేచ, జియానీలు కూడా చిరునవ్వుతో కనిపిస్తున్నారు.
డబుల్ ఇస్మార్ట్ సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తారు మేకర్స్.
డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలౌతుంది.
తారాగణం: రామ్ పోతినేని
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
డివోపీ: జియాని గియాన్నెల్లి
స్టంట్ డైరెక్టర్: కేచ
పీఆర్వో: వంశీ-శేఖర్
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…