ఓ సాథియా సినిమా థియేటర్లు పెంచుతున్నాం


ఆర్యన్‌గౌరా, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన చిత్రం ‘ఓ సాథియా’. దివ్యభావన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై సుభాష్‌ కట్టా, చందన కట్టా నిర్మించారు. జూలై 7న ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా విడుదలైన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులనుండి మంచి స్పందన లభిస్తుండటంతో లవ్‌లీ హిట్‌ అని మీడియాతో ముచ్చటించారు చిత్రయూనిట్‌.

దర్శకురాలు దివ్యభావన మాట్లాడుతూ– “మా ‘ఓ సాథియా’ సినిమాను చూసిన ఎంతోమంది నుండి వచ్చిన చక్కటి రెస్పాన్స్‌ చూసి చాలా ఆనందపడ్డాను. కానీ, చాలాచోట్ల, చాలా జిల్లాల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాలేదని డిప్రెషన్‌కి లోనయ్యాను” అన్నారు. నిర్మాత మాట్లాడుతూ– “సినిమాకు మంచి స్పందన వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా గురించి గొప్పగా మాట్లాడుతుండటంతో ఈ సినిమా రెండోవారంలో థియేటర్లను పెంచుతున్నాము. అలాగే చిన్న సినిమాలను మీడియా ప్రోత్సాహించాలి” అన్నారు.
హీరో ఆర్యన్‌ మాట్లాడుతూ– ‘‘నైట్‌ జాబ్‌ చేసుకుంటూ పగలు యాక్టింగ్‌ చేసి సినిమా కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డాను. సినిమాకి ఎటువంటి సంబంధంలేని ఇలాంటి నిర్మాతను ఒప్పించి ఇండస్ట్రీకి తీసుకువచ్చాను. నన్ను నమ్మి వచ్చిన నిర్మాతకు ఎలాగైనా న్యాయం చేయాలని సినిమా కోసం పోరాటం చేస్తున్నాను. నేనూ, మా సినిమా హీరోయిన్‌ మిస్తీ థియేటర్లకు వెళ్లి పబ్లిక్‌ టాక్‌ను, రెస్పాన్స్‌ను కళ్లారా చూశాము. వారి స్పందన చూసిన తర్వాత సినిమా రెండో వారం నుండి పెద్ద ఎత్తున సక్సెస్‌ సాధిస్తుందని నమ్ముతున్నాను. ఈ వారం మంచి థియేటర్లను సంపాదించి మీ ముందుకు వస్తున్నాం. మీడియా వారందరూ మా చిన్నసినిమాను బ్రతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

11 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

11 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

11 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago