బాబు మోహన్ క్లాప్ తోశ్రీకారం చుట్టుకున్నరెడ్డి మల్టీప్లెక్స్

ప్రతి రోజు సినిమా ఇండస్ట్రీకి కోటి కలలతో వచ్చే వారు ఎంతోమంది ఉంటారు. ఆ కలలను సాకారం చేయడం కోసం రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ ప్రై.లి. ప్రొడక్షన్ హౌస్ స్థాపించినట్లు యువ నిర్మాత విజయ్ రెడ్డి తెలిపారు. లాంగ్ టర్మ్ ప్లానింగ్‌తో వరుస సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. అందులో భాగంగా సోమవారం రామానాయుడు స్టూడియోస్ ఆవరణలో మూడు సినిమాలను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. 

రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ ప్రై.లి. సంస్థలో ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కిస్తున్న సినిమా ‘సోషల్ వర్కర్స్’. ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఎనిమిది మంది హీరోయిన్లు ప్రధాన పాత్ర,ల్లో కనిపించనున్నారు. రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ కథతో రూపొందుతున్న చిత్రమిది.

మహేందర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మిత్ర మూవీస్ భాగస్వామ్యంతో రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ ప్రై.లి. సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘కోబలి’. ఇందులో మిత్ర ప్రధాన పాత్రధారి. మరియు సహ నిర్మాత.

సోషల్ వర్కర్స్‘, ‘కోబలి‘ సినిమా పూజా కార్యక్రమాలకు ప్రముఖ నటుడు బాబు మోహన్, పలువురు రాజకీయ నాయకులు అతిథులుగా హాజరు అయ్యారు. పూజ అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బాబు మోహన్ క్లాప్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలతో పాటు ‘హ్యాపీ విమెన్స్ డే’ సినిమాను రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ సంస్థ ప్రకటించింది.  

బాబు మోహన్ మాట్లాడుతూ ‘‘ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 20 సినిమాలు ప్లాన్ చేశారు. రెండు సినిమాలు స్టార్ట్ చేశారు. ‘సోషల్ వర్కర్స్’ సినిమా ఓపెనింగ్ కు నన్ను పిలిచారు. ఆ తర్వాత ముందు నుంచి ఈ సినిమాలో ఓ పాత్రకు నన్ను అనుకుంటున్నట్లు చెప్పారు. అలా ఈ సినిమాలో నేనూ ఓ భాగం అయ్యాను. ఇది కాకుండా ‘కోబలి’ అని ‘అరుంధతి’ తరహాలో మరో సినిమా చేస్తున్నారు. మంచి ఉద్దేశంతో విజయ్ రెడ్డి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు. 

రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ అధినేత విజయ్ రెడ్డి మాట్లాడుతూ ”ముంబైలో మేం ఈ ‘రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్’ కార్పొరేట్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాం. ఆల్ ఓవర్ ఇండియాలో మాకు ఆఫీసులు ఉన్నాయి. ముంబై, చెన్నై, హైదరాబాద్, విశాఖలో ఆఫీసులు తెరిచాం. అన్ని భాషల్లో థియేట్రికల్, ఓటీటీ సినిమాలు తీస్తాం. త్వరలో ‘సోషల్ వర్కర్స్’ సినిమా స్టార్ట్ చేస్తాం. సినిమా రంగంలో బాధలు దీని కథాంశం. తర్వాత ‘కోబలి’ సెట్స్ మీదకు వెళుతుంది. అది హారర్ బేస్డ్ యూత్ ఫిల్మ్. విశాఖలో రెండు సినిమాలు తీయాలని ప్లాన్ చేశాం. త్వరలో వాటిని అనౌన్స్ చేస్తాం. కథలు రెడీ చేసుకున్న ఔత్సాహిక దర్శకులు గానీ, చిత్రసీమలో రాణించాలనుకుంటున్న నటీనటులు మమ్మల్ని సంప్రదించండి” అని చెప్పారు. 

‘కోబలి’ దర్శకుడు మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ ”దైవశక్తి, క్షుద్రశక్తి మధ్య జరిగే యుద్ధంతో తీస్తున్న చిత్రం “కోబలి”. మే లేదా జూన్ నెలలో తూర్పు గోదావరి జిల్లాలో చిత్రీకరణ చేద్దాం అనుకుంటున్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం” అని చెప్పారు. 

‘సోషల్ వర్కర్స్’ దర్శకుడు ప్రసాద్ మాట్లాడుతూ ”సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో కథ ఉంటుంది. ఇండస్ట్రీలో పరిస్థితులను సినిమాలో చూపిస్తున్నాం. ఎనిమిది మంది హీరోయిన్లు ఉంటారు. అందరివీ ప్రాముఖ్యం ఉన్న పాత్రలు. అవకాశం ఇచ్చిన విజయ్ రెడ్డి గారికి థాంక్స్” అని చెప్పారు. హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago