మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ చియాన్ విక్రమ్ కొత్త సినిమా ‘తంగలాన్’. పా. రంజిత్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా విక్రమ్ బర్త్ డే స్పెషల్ గా ఓ మేకింగ్ వీడియో గ్లింప్స్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ మూవీ గ్లింప్స్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వారందరికీ నచ్చేలా మేకింగ్ తో పాటు ఓ అద్బుతమైన వీడియో రిలీజ్ చేశారు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్(కేజీఎఫ్) నేపథ్యంలో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కోసం విక్రమ్ ఇంతకు ముందెప్పుడూ కనిపించని గెటప్ లో కనిపిస్తున్నాడు. ఈ వీడియో గ్లింప్స్ చూస్తోంటే మూవీ కోసం మొత్తం ఎంతో కష్టపడుతున్నట్టుగా ఉంది. ఈ తరహా చిత్రాల్లో విక్రమ్ ఎప్పుడూ ది బెస్ట్ ఇస్తాడు. అది మరోసారి తంగలాన్ తో కనిపించబోతోందనిపిస్తోంది.
ప్యాన్ ఇండియన్ సినిమాగా బహుభాషల్లో విడుదల కాబోతోన్న తంగలాన్ లో విక్రమ్ తో పాటు ఫీమేల్ లీడ్స్ లో పార్వతి, మాళవిక మోహనన్ నటిస్తుండగా.. ఓ కీలక పాత్ర కోసం హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్లాగిరోన్ ను తీసుకున్నారు. ఇతర పాత్రల్లో పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై, ప్రీతికరణ్, ముత్తుకుమార్ తో పాటు అనేకమంది ఇతర ప్రముఖులు నటిస్తున్నారు.
అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : ఎ.కిషోర్
సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్ రచయిత : తమిళ్ ప్రభ
ఆర్ట్ డిపార్ట్‌మెంట్ : ఎస్.ఎస్.మూర్తి
స్టంట్స్ : ఆర్.కె. సెల్వ, స్టన్నర్ సామ్
పి.ఆర్.వో : జి.ఎస్. కె మీడియా
నిర్మాణ సంస్థలు : స్టూడియో గ్రీన్ – కె.ఇ. జ్ఞానవేల్ రాజా, పా.రంజిత్ యొక్క నీలం ప్రొడక్షన్స్, యూవీ క్రియేషన్స్,
దర్శకత్వం : పా. రంజిత్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…