రావు రమేష్‌ గారు వండర్‌ఫుల్‌ ఆర్టిస్ట్ – అల్లు అర్జున్‌

Must Read


క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. ఇందులో రావు రమేష్ కథానాయకుడు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ… అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా, సుకుమార్ విశిష్ఠ అతిథిగా విచ్చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫస్ట్ టికెట్ అల్లు అర్జున్ గారికి ప్రజెంట్ చేశారు. ‘టికెట్ ఎంత పెట్టి కొంటున్నారు?’ అని సుమ అడగ్గా… ”సుకుమార్ గారి సినిమా. కోటి రూపాయలు అయినా పెడతా” అని చెప్పారు అల్లు అర్జున్. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ… ”నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను… హీరోని చూసి అందరూ ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్‌ను చూసి హీరో అయ్యా. సినిమా వచ్చి మూడేళ్లు అవుతుంది. మిమ్మల్ని ఇంకోసారి ఇంత ఇబ్బంది పెట్టను. ఎక్కువ సినిమాలు చేస్తా. సుకుమార్ గారి వైఫ్ తబితా సుకుమార్ గారు ప్రొడ్యూస్ చేశారు. ‘పుష్ప 2’ క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు వచ్చి ఒక్కటే మాట అడిగారు… ‘బన్నీ గారు నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా. ఎలాగో సుకుమార్ గారు వస్తారు. మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతా’ అన్నారు. ఆ మాట తర్వాత డిస్కషన్స్ లేవు, మాటల్లేవ్, మాట్లాడుకోడాలు లేవు. నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం అనేది చెబితే స్టుపిడ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్‌లతో పోలిస్తే మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్. ఆ పరిస్థితిలో కూడా ‘వస్తున్నా తబిత గారు’ అని చెప్పా. ఫ్రెండ్ అనుకో, ఇంకొకరు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకోండి… ఇష్టమైన వాళ్ళ కోసం మనం నిలబడాలి. నాకు ఇష్టమైతే వస్తా. నా మనసుకు నచ్చితే వస్తా. అది అందరికీ తెలిసిందే. తబిత భర్త సుకుమార్ గారు పాన్ ఇండియా రేంజ్‌లో ఉన్నారు. ఆవిడకు ఏ అవసరం లేకున్నా సినిమా చేస్తున్నందుకు థాంక్స్. ఆవిడది కంఫర్టబుల్ లైఫ్. కానీ, ఏదో ఒకటి చేయాలనే తపనతో సినిమా చేశారు. సుకుమార్ గారికి ఏమాత్రం సంబంధం లేకుండా ఆవిడ ఈ సినిమా చేశారు. అందుకు సభాముఖంగా అభినందిస్తున్నా. ప్రొడ్యూసర్స్ అందరికీ బెస్ట్ విషెష్. దర్శకుడు చాలా బాగా మాట్లాడారు. సినిమాలో ఎంత మంది పని చేసినా సరే హిట్ ఇచ్చేది దర్శకుడే. ఆల్రెడీ లక్ష్మణ్ కార్య ఈ టీం అందరికీ హిట్ ఇచ్చారు. ఆర్టిస్టులకు వస్తే… నా మనసుకు ఎంతో నచ్చిన ఆర్టిస్ట్ రావు రమేష్ గారు. ‘వేదం’ చూశాక దర్శకుడు క్రిష్ గారిని అడిగా… నక్సలైట్ క్యారెక్టర్ చేసింది ఎవరు? అని! రావు గోపాలరావు గారి అబ్బాయి అని చెప్పాడు. ఆ విషయం అప్పటి వరకు నాకు తెలియదు. మా తాతయ్య గారు, రావు గోపాలరావు గారు ఎన్నో సాయంత్రాలు మా ఇంట్లో టైం స్పెండ్ చేశారు. అప్పటి నుంచి రావు రమేష్ గారి గ్రాఫ్ చూశా. స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు. అందుకు నాకు మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. తెలుగులో తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందులో రావు రమేష్ గారు లేకపోతే చాలా క్యారెక్టర్స్ రావు. అటువంటి మంచి ఆర్టిస్ట్ ఉండటం తెలుగు సినిమా అదృష్టం. వండర్ ఫుల్ ఆర్టిస్ట్. ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇటువంటి కథలు ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను. అంకిత్, రమ్య, ఇంద్రజ గారు, టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థియేటర్లలో పెద్ద సినిమాలు చూడటానికి మాత్రమే ప్రేక్షకులు వస్తున్నారని అంటున్నారు. కానీ, చిన్న సినిమాలు చూడటానికి కూడా వస్తున్నారు. ఈ సినిమాకు కూడా రావాలని కోరుతున్నాను. ఇటీవల నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ నాకు అవార్డు వచ్చింది. ఈ ఏడాది రిషబ్ శెట్టి గారికి ‘కాంతార’కు వస్తే బావుంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆయనకు కంగ్రాట్స్. నాకు ఇష్టమైన ఆర్టిస్ట్, మంచి ఫ్రెండ్ నిత్యా మీనన్. ఆవిడకు అవార్డు రావడం ఆనందంగా ఉంది. జానీ మాస్టర్, ‘కార్తికేయ 2’ చిత్ర బృందానికి కంగ్రాట్స్. నాకు ‘బుట్ట బొమ్మ’తో పాటు ఎన్నో మంచి పాటలు చేసిన జానీకి, మన తెలుగు వారికి వచ్చినందుకు మనమంతా గర్వించాలి. ఇక, ‘పుష్ప 2’ విషయానికి వస్తే… సాధరణంగా ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే నాకు భయం ఉంటుంది. సినిమా ఎలా వచ్చింది? అనేది జనం చెప్పాల్సిన విషయం. అందుకు భయపడతా. కానీ, ‘పుష్ప 2’ సినిమా వస్తున్న విధానం అభిమానులకు నచ్చుతుంది. డిసెంబర్ 6న అసలు తగ్గేది లే. ఇది మాత్రం ఫిక్స్” అని అన్నారు. 

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మాట్లాడుతూ… ”మా ఆవిడ ఫస్ట్ టైం ప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఈవెంట్ దగ్గర ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఏమీ అనుకోవద్దు. మా ఆవిడ సినిమా చూసింది. పగలబడి నవ్వానని చెప్పింది. మా ఫ్యామిలీ, తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకు వెళ్ళింది. అందరికీ సినిమా నచ్చింది. నన్ను చూడమని చెప్పింది. నాకు టైం దొరకడం లేదు. ఒక రోజు హోమ్ థియేటర్లో చూశా. నాకు చాలా బాగా నచ్చింది. కానీ, ఇప్పుడు ఉన్న బిజీలో సినిమా మీద కాన్సంట్రేట్ చేసి రిలీజ్ చేయడం కష్టమని చెప్పా. ‘మంచి సినిమా. నేను వదలను. చేస్తా’ అని చెప్పింది. ‘చేసుకో’ అని చెప్పాను. ఉపాసన గారికి మెసేజ్ చేసి రామ్ చరణ్ గారితో ట్రైలర్ ట్విట్టర్‌ ద్వారా రిలీజ్ చేయించిందని తెలిసింది. తర్వాత చరణ్ కు సారీ అని మెసేజ్ చేశా. అమాయకత్వంతో చేసిందని చెప్పా. ‘ప్రాబ్లమ్ ఏమీ లేదు’ అని చెప్పాడు. థాంక్యూ చరణ్. మైత్రి శశి గారికి సినిమా చూపించింది. రవి, నవీన్ గారు సినిమా చూశారు. వాళ్లకూ నచ్చింది. డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ముందుకు వచ్చారు. నాకు తెలియకుండా ధైర్యంగా బన్నీ గారి దగ్గరకు వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రమ్మని అడిగింది. నా దగ్గరకు వచ్చి ‘నేను అడిగా. ఆయన ప్రీ రిలీజ్‌కు వస్తానన్నారు’ అని చెప్పింది. ‘నీకు బుద్ధి ఉందా. ఇక్కడ క్లైమాక్స్ జరుగుతుంది. మాకు చాలా వర్క్ ఉంది’ అని చెప్పా. ‘సారీ డార్లింగ్! ఏం అనుకోవద్దు’ అని చెప్పా. అప్పుడు బన్నీ గారు ‘ఫస్ట్ టైం ఆవిడ ప్రజెంట్ చేస్తున్నారు. అదీ ఇండిపెండెంట్ గా. నేను వస్తా’ అన్నారు. కాకపోతే నన్ను నాలుగు గంటలకు పంపించమని అడిగారు. ఇక్కడికి వచ్చిన బన్నీ గారికి థాంక్స్. ఆయన రాకతో ఇది పెద్ద సినిమా అయ్యింది. ఆయన ఇక్కడికి రావడం చాలా పెద్ద విషయం. రావు రమేష్ గారి లాంటి నటులు హీరో పాత్రలు చేస్తే చాలా కథలు బయటకు వస్తాయి. బన్నీకి స్టార్ కంటే ముందు పెర్ఫార్మన్స్ చేయాలని ఉంటుంది. రావు రమేష్ గారికి అటువంటి పెర్ఫార్మన్స్ చేసే అవకాశం దొరికింది. క్లైమాక్స్ వచ్చేసరికి నాకు కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. రావు రమేష్ గారికి ప్రతిదీ ఫస్ట్ టేక్ లో చేశానని చెప్పారు. లక్ష్మణ్ కార్య అద్భుతంగా తీశాడు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.              

తబితా సుకుమార్ మాట్లాడుతూ… ”నా కామన్ ఫ్రెండ్స్ ద్వారా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ గురించి తెలిసింది. లక్ష్మణ్ కార్యను కలిసినప్పుడు సినిమా చూడమని అడిగారు. అప్పటికి సినిమా పూర్తి కాలేదు. ఒక సాంగ్ తీయాలి. ఆ టైంలో చంద్రబోస్ గారికి ఫోన్ చేసినప్పుడు సాంగ్ రాయడానికి ఒప్పుకొన్నారు. చిన్న సినిమా అని చూడలేదు. భాస్కరభట్ల రాసిన పాటలు సినిమాకు హెల్ప్ అయ్యాయి. నేను అడిగిన వెంటనే ట్రైలర్ ట్వీట్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. లక్ష్మణ్ నాకు షో వేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశా. ఇది చిన్న స్థాయిలో ప్రేక్షకుల్లోకి వెళ్ళకూడదు, పెద్దగా వెళ్లాలని నేను ప్రజెంట్ చేస్తానని లక్ష్మణ్ కార్యతో చెప్పాను. కళ్యాణ్ నాయక్ మ్యూజిక్ సినిమాకు హెల్ప్ అయ్యింది. ‘నేను ఉన్నాను’ అని దర్శకుడికి మాట ఇచ్చాను. అప్పుడు ‘పుష్ప 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆయనకు బాలేనప్పుడు ఇంట్లో సినిమా చూపించా. నేను ఎంత సినిమాను నమ్మినా నా భర్త నుంచి అప్రూవల్ ఇంపార్టెంట్. నా వెనుక ఆయన ఉన్నారనే ధైర్యం ఎక్కువ. సుక్కు వల్ల నేను చేసిన సినిమాను మైత్రి రవి గారు, నవీన్ గారు, చెర్రీ గారు, శశి గారు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ నమ్మాలని సినిమా చూపించా. సినిమా నచ్చిందని సుక్కు చెప్పాక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ ఈవెంట్‌కి వచ్చిన బన్నీ గారికి థాంక్స్. పుష్ప 2 క్లైమాక్స్ షూట్ అవుతుంది. బన్నీ గారు, సుక్కు చాలా బిజీ. రాలేనని బన్నీ గారు చెప్పొచ్చు. కానీ, నేను వెళ్లి ఫస్ట్ టైమ్ ప్రజెంట్ చేస్తున్నానని, రావాలని అడిగినప్పుడు ‘తబితా గారు… మీరు ఫ్యామిలీ అండీ, మీ కోసం తప్పకుండా వస్తా. అది నా బాధ్యత’ అన్నారు. ఆయనకు థాంక్స్. రావు రమేష్, అంకిత్ కాంబినేషన్ సీన్స్ చూసి క్రేజీగా ఫీలయ్యాను. నాకు సినిమాలో ఇంద్రజ గారి డ్యాన్స్ సీక్వెన్స్ చాలా ఇష్టం. మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఆగస్టు 23న అందరూ సినిమా చూడండి” అని అన్నారు.

రావు రమేష్ మాట్లాడుతూ… ”నువ్వు కలిసే ప్రతి వ్యక్తి జీవితంలోనో, జీవితంతోనో పోరాటం చేస్తూ ఉంటాడు, వాళ్ళ పట్ల దయతో ఉండండి – నేను ఇది చెబితే సీరియస్ గా ఉంటుంది. ఇందులో నా కొడుకు క్యారెక్టర్ చూస్తే… మా నాన్న అల్లు అరవింద్ గారు, మా అన్నయ్య అల్లు అర్జున్ అంటుంటే అతడిదొక యుద్ధం. కానీ, అతనితో దయగా ఉండాలి. మారుతి నగర్ సుబ్రమణ్యానిది ఓ యుద్ధం. అతను ఓ నూతిలో కప్ప. అన్నీ తెలుసన్నట్టు కనిపిస్తాడు. కానీ, ఏమీ తెలియదు. నన్ను అప్డేట్ చేయమని కొడుకును అడుగుతాడు. ఇటువంటి అద్భుతమైన ప్రపంచాన్ని దర్శకుడు లక్ష్మణ్ కార్య సృష్టించాడు. సింప్లిసిటీని టచ్ చేశాడు. అందులో గొప్ప హ్యూమర్ రాశాడు. అలా చేయాలంటే జీవితంలో బాగా నలిగి ఉండాలి. సినిమాకు అన్నీ స్పీడుగా జరిగాయి. సాంగ్స్ అన్నీ హిట్ అయ్యాయి. నెక్స్ట్ ఏంటి? అంటే… తబితా సుకుమార్ సపోర్ట్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ బ్యాకప్ రావడానికి టైం పట్టింది. తబిత గారికి సినిమా నచ్చి ప్రజెంట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆవిడ కృషి వల్ల సుకుమార్ గారు సినిమా చూశారు. రామ్ చరణ్ గారు బిజీగా ఉన్నా ట్రైలర్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఆయనకు థాంక్స్. బన్నీ గారు, సుకుమార్ గారితో ‘పుష్ప 2’ షూటింగ్ చేస్తున్నాను. వాళ్లిద్దరూ ఇక్కడికి వస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. వాళ్లను ఇక్కడికి తీసుకు రావడం తబిత గారికి మాత్రమే సాధ్యమైంది. ఆవిడ డైనమిక్ లేడీ. దయచేసి ఆగస్టు 23న థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ చేసే చిత్రమిది” అని అన్నారు. 

దర్శకుడు లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ… ”ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నయ్య అభిమానులకు, సుకుమార్ గారి ఫ్యాన్స్, రావు రమేష్ గారి ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. దర్శకుడిగా తొలి సినిమా తర్వాత ఆరు నెలలు ఏం చేయాలో అర్థం కాలేదు. కాస్త నిరాశలో ఉన్నాను. అప్పుడు ఓ సక్సెస్ మీట్ చూస్తుంటే బన్నీ అన్నయ్య ఓ మాట మాట్లాడారు… ‘అద్భుతం జరగాలంటే పట్టుకోకూడదు, వదిలేయాలి’ అన్నారు. ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చింది. తర్వాత ఒక్క నెలలో ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ కథ రాశా. తర్వాత నెలలో షూటింగ్ స్టార్ట్ చేశాం. సుకుమార్ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని. ఇప్పుడు ఆయన నాకు జీవితాన్ని ఇచ్చేశారు. తబిత గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మాతో పాటు, మాకు అండగా నిలబడ్డారు. రావు రమేష్ గారు నాకు ఎంఎస్ ధోనిలా. ఆయనకు బ్యాట్ ఇచ్చిన ప్రతిసారి సిక్సర్లు కొట్టారు. ఆయన్ను 20-20లో ఓపెనర్‌గా దింపుతున్నాను. 20 ఓవర్లు ఉంటారు. ఇక చూసుకోండి” అన్నారు.

నటి ఇంద్రజ మాట్లాడుతూ… ”గెలుపు అనేది డబ్బు, పేరు, హోదా సంపాదించి మనం ఎదగడం కాదు… ఎదుటి వ్యక్తిలో ప్రతిభను గుర్తించి అతను ఎదగడానికి ఏదో ఒక రకంగా సాయపడుతూ తోడుగా ఉండటం! సుకుమార్ గారికి మనస్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నాను. లక్ష్మణ్ గారి ప్రతిభను, ఈ సినిమాలో కంటెంట్ గుర్తించి సపోర్ట్ చేశారు. మా సినిమా ఓవర్ నైటులో అందరికీ రీచ్ అయ్యిందంటే కారణం సుకుమార్, తబిత దంపతులు. తబిత సుకుమార్ గారు ప్రజెంట్ చేస్తున్నాడని తెలియడంతో సినిమా అందరికీ చేరువైంది. సినిమా చూసినంత సేపూ బన్నీ గారు కనపడతారు. ఇది ఒక్క అల్లు అర్జున్ గారి మూవీ కాదు, అల్లు ఫ్యామిలీ మూవీ. ఎందుకంటే మూవీ కంటెంట్ అలాంటిది. రావు రమేష్ గారు వండర్ ఫుల్ కోస్టార్. ప్రతి ఇల్లాలు ఎక్కడో ఒక చోట ఇది నా కథ అనుకునేలా నేను పోషించిన కళారాణి క్యారెక్టర్ ఉంటుంది. ప్రతి భర్త ఇటువంటి భార్య కావాలని, ప్రతి కొడుకు ఇటువంటి తల్లి కావాలని అనుకుంటారు. ప్రేక్షకులు అందరికీ సినిమా నచ్చుతుంది” అని అన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ శశి మాట్లాడుతూ… ”అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, సుకుమార్ గారి ఫ్యాన్స్, రావు రమేష్ గారి అభిమానులకు, ఆర్టిస్టులు అందరికీ థాంక్స్. సినిమా డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చిన తబిత గారికి థాంక్స్. మాకు మేడమ్ గారు సినిమా చూపించినప్పుడు మా అందరికీ ఎంతో నచ్చి, బాగా ఎంటర్టైన్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకున్నాం. సినిమా మొత్తం కామెడీయే. మంచి ఎంటర్టైనర్. ‘ఎవడి గోల వాడిది’ లాంటి సినిమా. రావు రమేష్ గారిది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ రోల్. ఆయన అన్ని వేరియేషన్స్ చూశారు. థియేటర్ మొత్తం లాఫింగ్ థెరపీలా ఉంటుంది. ఆడియన్స్ అందరికీ స్ట్రెస్ బస్టర్ లా ఉంటుంది” అని అన్నారు.

అంకిత్ కొయ్య మాట్లాడుతూ… ”నేను గీతం యూనివర్సిటీలో స్టేజి షోలు చేశా. ఓ క్యాస్టింగ్ డైరెక్టర్ 2016లో ఫోన్ చేసి ‘అల్లు అర్జున్ గారితో ఓఎల్ఎక్స్ యాడ్ ఉంది. చేస్తావా?’ అన్నారు. ఎగిరి గంతేసి ఆడిషన్ ఇచ్చా. సెలెక్ట్ అయ్యా. ముంబై వెళ్లి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నతో ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు వచ్చా. ఆ యాడ్ వచ్చాక మా ఫ్యామిలీ అంతా హ్యాపీ. అప్పుడు క్యాస్టింగ్ డైరెక్టర్ గారికి కాల్ చేసి థాంక్స్ చెప్పాను. అప్పుడు ఆవిడ ‘బాబు, నువ్వు థాంక్స్ చెప్పాల్సింది బన్నీ అన్నకి. ముంబైలో 30 సెకన్స్ యాడ్ షూట్ కోసం తెలుగు అబ్బాయిని అక్కడి వరకు తీసుకు వెళ్లడం ఎందుకు? అక్కడ హిందీ నటులతో చేయించి డబ్బింగ్ చెప్పించాలనుకున్నాం. తెలుగు అబ్బాయే యాడ్ చేయాలని బన్నీ గారు చెప్పడం, ముంబైకి తెలుగు అబ్బాయి రావాలని చెప్పారని వివరించారు. నా ఆడిషన్ చూసి ఆయనే సెలెక్ట్ చేశారు. నా కెరీర్ మొదలైంది ఆయనతో! ఇప్పుడు ఆయన ఇక్కడికి రావడం టర్నింగ్ పాయింట్. మా దర్శకుడు చెప్పడంతో ‘మేడమ్ సార్ మేడమ్’ పాటలో బన్నీ గారి ఐకానిక్ మూమెంట్స్ రీ క్రియేట్ చేశాం. ఆ పాట హిట్ అవ్వడానికి కారణం బన్నీ ఫ్యాన్స్. సుకుమార్ గారి శిష్యుడు రొంగలి శ్రీనివాస్ నాకు ఓ విధంగా గురువు. ఆయన దర్శకత్వంలో ఐదు నిమిషాల క్యారెక్టర్ అయినా చేయాలని  కోరుకుంటున్నా. సినిమా విడుదల అవుతున్న 23 మాకు పండగ అయితే, ఆ పండక్కి దేవత తబితా సుకుమార్ గారు. ఆవిడ లేకపోతే సినిమా ఈ స్థాయికి వచ్చేది కాదు. మా సినిమా హీరో రావు రమేష్ గారు. ఆయనతో నటించడం వల్ల, ఆయన పక్కన రెండు గంటల సినిమా చేయడం వల్ల నా స్థాయి పెరిగింది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. నాకు ఈ సినిమాలో అవకాశం రావడానికి కారణమైన ఇంద్రజ గారికి థాంక్స్. మా దర్శకుడు లక్ష్మణ్ కార్య నిజాయతీ వల్ల సినిమా ఇక్కడి వరకు వచ్చింది. మా నిర్మాతలకు థాంక్స్” అని అన్నారు.

సాహిత్య రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ… ”మారుతి నగర్ సుబ్రమణ్యం స్థాయి పెంచిన సుకుమార్ గారికి, తబిత గారికి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి థాంక్స్. ఓ చిన్న సినిమాకు ఎంత మంది చేయూత ఉంటే అంత మంచిది. దర్శకుడు లక్ష్మణ్ నాకు మంచి ఫ్రెండ్, ఈ సినిమా ద్వారా నాకు దొరికిన మరో ఫ్రెండ్ సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్. ఇందులో మూడు సాంగ్స్ రాశా. మనసుకు సంతృప్తి ఇచ్చిన పాటలు ఇవి. చాలా కాలం తర్వాత సంతోషంగా, కష్టపడకుండా ప్రేమించి రాశా. మనసా వాచా కర్మణా సినిమా విజయాన్ని కోరుకుంటున్నా” అని అన్నారు.

రమ్య పసుపులేటి మాట్లాడుతూ… ”రావు రమేష్ గారు సినిమాలో పది నిముషాలు ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. రెండు గంటలు ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. స్క్రిప్ట్ చదివినప్పుడు పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకున్నా. సినిమా మీద నాకు అప్పుడే నమ్మకం వచ్చింది. అల్లు అర్జున్ గారు సక్సెస్ మీట్ లో తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలని చెప్పిన మాటలు నాపై ఎంతో ప్రభావం చూపించాయి. బ్యాచిలర్స్ చేసిన తర్వాత మాస్టర్స్ చేయాలా? సినిమా ఇండస్ట్రీలోకి రావాలా? అని కన్‌ఫ్యూజ్ అయినప్పుడు ఆ మాటలు విన్నా.  వచ్చేశా” అని అన్నారు. 

నిర్మాత శ్రీహరి మాట్లాడుతూ ”రావు రమేష్ గారికి నటనలో తెలియని మెళకువలు ఉండవు. ఆయన ఇరగదీశారు. ఇంద్రజ గారు, అంకిత్, రమ్యతో పాటు నటీనటులు అందరూ బాగా చేశారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ‘మేడమ్ సార్ మేడమ్..’ సాంగ్ పెద్ద హిట్ చేశారు. థాంక్స్. మా పర్వతం తబిత సుకుమార్ గారు, సుకుమార్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సినిమాను తబిత గారు చూడటం మేము ఏ జన్మలో చేస్తున్న అదృష్టమో తెలియదు. ఆవిడ వల్ల సినిమా ఈ స్థాయికి వచ్చింది. సుకుమార్ గారికి జీవితాంతం రుణపడి  ఉంటాం. తబిత గారితో పాటు సినిమా ఇండస్ట్రీ అందరికీ నచ్చిందంటే కారణం లక్ష్మణ్ కార్య దర్శకత్వం. తను నా ఫ్రెండ్” అని అన్నారు.

నిర్మాత పీబీఆర్ సినిమాస్ బుజ్జి మాట్లాడుతూ… ”బన్నీ గారికి, ఆయన అభిమానులకు నమస్కారం. తబిత గారి సాయంతో సినిమాను ఈ స్థాయికి తీసుకు వచ్చాం. రావు రమేష్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. నటీనటులు అంతా బాగా చేశారు. ఆగస్టు 23 నుంచి థియేటర్లలో సినిమా చూడండి” అని చెప్పారు. 

నటి బిందు మాట్లాడుతూ… ”ఈ సినిమాలో నేను హీరోయిన్ రమ్య పసుపులేటి అమ్మ పాత్ర చేశా. అంకిత్ కొయ్య కామెడీ టైమింగ్ బావుంది. రావు రమేష్ గారితో ఏ సినిమా చేసే అవకాశం దొరికినా ఆయన దగ్గర యాక్టింగ్ క్లాసులు తీసుకుంటా. ఆయన నా ఇన్స్పిరేషన్, నా గైడ్, నా మోటివేషన్. హర్షవర్ధన్ గారు, నేను భార్యాభర్తలుగా నటించిన మూడో చిత్రమిది. సినిమా ప్రజెంట్ చేస్తున్న తబిత సుకుమార్ గారికి థాంక్స్. ముఖ్య అతిథులుగా వస్తున్న అల్లు అర్జున్, సుకుమార్ గారికి థాంక్స్. నేను ‘పుష్ప 2’లో నటిస్తున్నా” అని చెప్పారు.

సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ… ”అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరికీ సాంగ్స్. ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ పదం తీసుకుని సాంగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేశా. బన్నీ గారి ఫ్యాన్స్ ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా కూడా మామూలుగా ఉండదు. అంత అందంగా ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్, పీబీఆర్ సినిమాస్ ప్రసాద్, లోకమాత్రే సినిమాటిక్స్ మోహన్ కార్యతో పాటు పలువురు ప్రముఖులు, చిత్ర బృంద సభ్యులు పాల్గొన్నారు.

Latest News

Nuvvu Gudhithe lyrical song from Drinker Sai

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline Brand of Bad Boys....

More News