నవరాత్రి ఆరంభం సందర్భంగా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ పోస్టర్ విడుదల

నవరాత్రి శుభారంభం సందర్భంగా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘మర్దానీ 3’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంచి, చెడుకి జరిగే పోరాటాల్ని ‘మర్దానీ 3’లో చూపించబోతోన్నారు. రాణి ముఖర్జీ తనకు ఎంతో ఇష్టమైన, ప్రేమించిన డేర్ డెవిల్ పోలీస్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో మరోసారి కనిపించబోతోన్నారు. మహిషాసురుడిని చంపినప్పుడు దుర్గా మాత శక్తిని తెలిపే ‘అయిగిరి నందిని’ శ్లోకంతో రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయింది. ఓ కేసుని పరిష్కరించడానికి, దాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే శివానీ సంకల్పం ఎలాంటిదో ఈ పోస్టర్ చెప్పకనే చెబుతోంది.

ఇండియాలో ఉమెన్ సెంట్రిక్‌గా వచ్చిన చిత్రాలు, సిరీస్‌లలో ‘మర్దానీ’కి ఉండే ప్రత్యేక స్థానం గురించి అందరికీ తెలిసిందే. సమాజానికి కనువిప్పు కలిగించేలా, కళ్ళు తెరిపించేలా అద్భుతమైన కథలతో ‘మర్దానీ’ ప్రతీ సారి ఆకట్టుకుంటూనే ఉంటుంది. మన దేశంలో ప్రతిరోజూ జరిగే దారుణమైన నేరాలను అందరూ గుర్తించేలా ‘మర్దానీ’ ఫ్రాంచైజీలు వస్తుంటాయి.

మర్దానీ (2014), మర్దానీ 2 (2019) వంటి భారీ విజయాల తర్వాత ఈ మూడో అధ్యాయం ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌ను ఇచ్చేలా తెరకెక్కిస్తున్నారు. అభిరాజ్ మినావాలా దర్శకత్వంలో ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. YRF నుంచి ఐకానిక్ ఉమెన్-కాప్ ఫ్రాంచైజీలో భాగంగా రానున్న ఈ మూడో పార్ట్‌ని ఫిబ్రవరి 27, 2026న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

4 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

4 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago