రామ్ పోతినేని, ‘డబుల్ ఇస్మార్ట్’కు A సెన్సార్ సర్టిఫికేట్

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ .   

అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏ సర్టిఫికెట్ పొందింది.

డబుల్ ఇస్మార్ట్ ఏ సర్టిఫికేట్ ఇంటెన్స్ యాక్షన్ సీన్స్, కమర్షియల్ ఎట్రాక్షన్స్ ని హైలైట్ చేస్తుంది. 2 గంటల 42 నిమిషాల రన్ టైం గల ఈ మూవీ డైనమిక్, గ్రిప్పింగ్ నెరేటివ్ తో ప్రేక్షకులను అద్భుతంగా ఆలరించనుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఫస్ట్ హాఫ్‌లో ది బెస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ ఆడియన్స్ ఆశ్చర్యపరిచేలా చేయనుంది, క్లైమాక్స్ ఎక్స్ ట్రార్డినరీ, మెమరబుల్ గా ఉండబోతోంది. 

మాస్ అప్పీల్, ఇంటెన్స్ యాక్షన్, ఎంటర్ టైన్మెంట్ తో డబుల్ ఇస్మార్ట్ కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీగా వుంటుంది. ట్రైలర్‌లో రామ్ పోతినేని ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో అరదగొట్టారు. సంజయ్ దత్ పవర్ ఫుల్ ప్రన్స్ సినిమాకి మరింత వాల్యూని యాడ్ చేసింది. వారి ఫేస్ అఫ్ మెయిన్ హైలైట్‌గా వుండబోతోంది.

రామ్, కావ్య థాపర్ మధ్య రొమాంటిక్ ట్రాక్ యూత్ అండ్ ఆడియన్స్ ను ఆకర్షించేలా సెట్ చేయబడింది. అలీ కామిక్ క్యారెక్టర్ సినిమా ఎంటర్ టైన్మెంట్ ని మరింత ఎలివేట్ చేయనుంది. ఈ ఎలిమెంట్స్ తో పాటు మణి శర్మ రూపొందించిన ఆల్బమ్ చార్ట్‌బస్టర్ హిట్ అయ్యింది.

ఈ ప్రామెసింగ్ ఫీచర్స్ తో డబుల్ ఇస్మార్ట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. పూరి కనెక్ట్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనుంది. ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్‌లు యుఎస్ఏ లో ప్రారంభమయ్యాయి.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

4 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

4 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

4 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

4 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

4 days ago