టాలీవుడ్

క్లీంకార ఆగ‌మ‌నాన్ని అంద‌మైన వీడియోతో ప‌రిచ‌యం చేసిన రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల జీవితంలో జూన్ 20 ఎంతో కీల‌కం. ఎందుకంటే ఆరోజున క్లీంకార పుట్టుక‌తో వారు త‌ల్లిదండ్రులుగా జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభించారు. దీనిపై మెగాభిమానులు, కుటుంబ స‌భ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. కాగా గురువారం (జూలై 20) రోజున‌ వీరు క్లీంకార ఆగ‌మ‌నానికి సంబంధించిన హృద‌యానికి హ‌త్తుకునే అంద‌మైన వీడియోను విడుద‌ల చేశారు. యాదృచ్చికంగానే జ‌రిగిన‌ప్ప‌టికీ గురువారంతో పాప పుట్టి నెల రోజులే అవుతుంది. గురువారం రోజునే ఉపాస‌న పుట్టిన‌రోజు కావ‌టం విశేషం. క్లీంకార వన్ మంత్ బ‌ర్త్ యానివ‌ర్స‌రీ వీడియోను టాలెంటెడ్ ఫిల్మ్ మేక‌ర్‌ జోసెఫ్ ప్ర‌త‌నిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు.

ఈ వీడియోలో లెజెండ్రీ యాక్ట‌ర్ మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న సతీమ‌ణి సురేఖా కొణిదెలతో పాటు ఉపాస‌న త‌ల్లిండ్రులు శోభా కామినేని, అనీల్ కామినేని కూడా ఉన్నాయి. కుటుంబ స‌భ్యులంద‌రూ ఉన్నారు. అంద‌ద‌రిలోనూ ఎగ్జ‌యిట్‌మెంట్‌, ఆనందం ఉండ‌టాన్నిమ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. క్లీంకార పుట్టిన త‌ర్వాత కుటుంబ స‌భ్యులు, అభిమానులు అంద‌రూ పండుగ చేసుకున్నారు. వాట‌న్నింటినీ వీడియోలో అందంగా చూపించారు.

ఈ భావోద్వేగం గురించి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ క్లీంకార పుట్టే స‌మ‌యంలో మా అంద‌రిలోనూ తెలియ‌ని టెన్ష‌న్‌. అంతా స‌రిగ్గా జ‌ర‌గాల‌ని మేం అంద‌రూ ప్రార్థిస్తున్నాం. అందుకు త‌గిన‌ట్టే అన్నీ అనుకూలంగా మారి స‌రైన స‌మ‌యం కుద‌ర‌టంతో పాప ఈ లోకంలోకి అడుగు పెట్టింద‌ని భావిస్తున్నాను. పాప పుట్టిన ఆ క్ష‌ణం మ‌న‌సుకి ఆహ్లదంగా, చాలా సంతోషంగా అనిపించింది. పాప పుట్ట‌టానికి ప‌ట్టిన 9 నెల‌ల స‌మ‌యం, అప్పుడు జ‌రిగిన ప్రాసెస్ అంతా త‌లుచుకుని హ్యాపీగా ఫీల‌య్యాం అన్నారు.

క్లీంకార రాకకు దారి తీసిన ఆ మ‌ర‌పురాని క్ష‌ణాల‌తో పాటు, పాప‌కు ఆ పేరు పెట్ట‌టానికి కార‌ణ‌మైన అస‌లు క‌థ‌ను కూడా వీడియోలో మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. భార‌త‌దేశంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ఒడిస్సా ప్రాంతాల్లో నివ‌సిస్తున్న చెంచు జాతి నుంచి స్ఫూర్తిని పొందారు. స‌ద‌రు చెంచు జాతి ద్రావిడు సంస్కృతిలో భాగం. వారి సంస్కృతిలోని గొప్ప‌త‌నం, విలువ‌లే పాపకు ఆ పేరు పెట్ట‌టానికి కార‌ణ‌మ‌య్యాయి.

ఈ సంద‌ర్భంగా ఉపాస‌న కొణిదెల మాట్లాడుతూ మా పాప ద్రావిడ సంస్కృతిలో భాగం కావాల‌ని నేను కోరుకున్నాను. ఆమె పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగుల‌ను ఇవ్వ‌కండి. అలాంటి వాటిని వారే స్వ‌యంగా సాధించుకోవాల‌ని నా అభిప్రాయం. పిల్ల‌ల పెంప‌కంలో ఇవెంతో ముఖ్య‌మైన‌వి. జీవితంలో ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదించాలి.మ‌నం అంద‌రితో క‌లిసి సంతోషంగా ఉన్న స‌మ‌యానికి విలువ ఇవ్వాల‌ని నేను భావిస్తాను అన్నారు.

వారి కుటుంబాల‌కు సంబంధించిన ప్ర‌త్యేక‌మైన వీడియోను ప్ర‌జ‌ల‌కు చూపించ‌టం ద్వారా రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల‌ను నెటిజ‌న్స్ అభినందిస్తున్నారు. అభిమానులు, ప్రేక్ష‌కులు, స్నేహితులు, స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యులు చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాల‌పై చ‌ర‌ణ్, ఉపాస‌న కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

21 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago