అథర్వణ భద్రకాళి పిక్చర్స్ అధికారికంగా ‘రాకాస’ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను పొందింది. ‘రాకాసా’ వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ మీద ముద్రను వేయనుంది. ఈ చిత్రం యూఎస్ఎ, యూరప్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియాలో 350కి పైగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ‘రాకాస’ ఓవర్సీస్‌లో ఈ రేంజ్‌లో రిలీజ్ కాబోతోండటంతో అక్కడి ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగాయి.
ఓవర్సీస్ పంపిణీల్లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్‌కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘రాకాస’ టైటిల్ ప్రకటన, గ్లింప్స్ తరువాత పెరిగిన బజ్, డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. ‘రాకాస’పై ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి.
https://www.instagram.com/reel/DUvPdfskeL9
‘రాకాస’ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1.8 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఇదొక విజువల్ వండర్‌గా సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉండనుంది. కెమెరామెన్ అందించిన విజువల్స్, బీజీఎం గురించి ప్రతీ ఒక్కరూ మాట్లాడుకున్నారు. టెక్నికల్ పరంగా ‘రాకాస’కి మంచి పేరు లభించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ‘రాకాస’ యూనిట్ పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఎడిట్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ వంటి వాటిపై టీం పని చేస్తోంది. గతంలో విడుదల చేసిన పోస్టర్, గ్లింప్స్ సినిమా స్థాయిని పెంచేశాయి. ‘రాకాస’ నేషనల్ వైడ్‌గానే కాకుండా ఓవర్సీస్ ఆడియెన్స్‌లోనూ బజ్‌ను క్రియేట్ చేసింది.
‘రాకాస’లో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ వంటి వరుస బ్లాక్ బస్టర్ల తర్వాత సంగీత్ ‘రాకాస’తో మళ్లీ హిట్టు కొట్టేందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను వంటి అద్భుతమైన నటీనటులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి మానస శర్మ రచన, దర్శకత్వం వహించారు. మానస శర్మ, సంగీత్ శోభన్‌తో మానస శర్మ తీసిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌ను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మించారు. ఇప్పుడు మళ్లీ ఈ టీం కలిసి వస్తోంది. ఇక ఈ ‘రాకాస’ చిత్రాన్ని Z స్టూడియోస్ సమర్పిస్తుండగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతం, రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలోనే అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ఈ మూవీ ఓవర్సీస్ హక్కుల్ని దక్కించుకుని అందరి దృష్టిని ఆకట్టుకుంది.
-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్…
ఫోనిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై, మాస్టర్ జియాన్స్ సమర్పణలో సత్యం రాజేష్, రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న “ఫ్రెండ్లీ ఘోస్ట్”…
ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సింధుసూర్య నిర్మిస్తున్న నూతన చిత్రం 'శివ గాడి జిందగీ'. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని…
ది మేజ్" చిత్రంతో దర్శకుడిగా డాక్టర్ కాబోయి యాక్టర్ కావడం చూస్తుంటాం కానీ డా. రవికిరణ్ గడలాయ్ ఎం.డి, పాథాలజిస్ట్…
ఎంఎస్ రాజు గారు ‘అగధ’ సీక్వెల్ ఎప్పుడు అంటారో చూడాలి - హీరో శ్రవణ్ రెడ్డి శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్…
హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని…