సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్’. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. సామాజిక పరమైన సమస్యలను తెలియజేసేలా సినిమాలు చేస్తూ విమర్శకులు ప్రశంసలను అందుకున్న దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ కాంబోలో రాబోతున్న ఈ పాన్ ఇండియ మూవీ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. బ్లాక్ బస్టర్ చిత్రాలు 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్ష్ కలయికలో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్’.
వేట్టైయాన్ ప్రమోషన్స్‌లో వేగం పుంజుకుంది. అందులో భాగంగా ఈ సినిమా నుంచి తొలి పాటను మేకర్స్ విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. పేట, దర్బార్, జైలర్ చిత్రాల తర్వాత రజినీకాంత్, రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ కలయికలోనూ రానున్న నాలుగో సినిమా కూడా ఇదే కావటం విశేషం. సూపర్ స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టు ఆయన అభిమానులు సహా అందరినీ దృష్టిలో పెట్టుకుని అనిరుధ్ మరోసారి తనదైన పంథాలో బాణీలను అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి సెప్టెంబర్ 9న ‘మనసిలాయో..’ అనే పాటను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రతీ అనౌన్స్‌మెంట్‌కి సినిమాపై భారీ అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషరా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆడియెన్స్‌కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వటానికి సిద్ధమవుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
నటీనటులు:
సూపర్‌స్టార్ రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషరా విజయన్ తదితరులు
నటీనటులు:
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్, సుభాస్కరన్, టి.జె.జ్ఞానవేల్, మ్యూజిక్: అనిరుద్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్.కదిర్, ఎడిటర్: ఫిలోమిన్ రాజ్, ప్రొడక్షన్ డిజైన్: కె.కదిర్, యాక్షన్: అన్బరివు, కొరియోగ్రఫీ: దినేష్, పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్- ఫణి కందుకూరి(బియాండ్ మీడియా).
మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…
మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…
పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…
సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…
రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…