సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సంతోష్ కుమార్ నిర్మాణంలో, సంచలన విజయం సాధించిన కెజియఫ్ ఫేమ్ యశ్ హీరోగా, షీనా హీరోయిన్ గా, కె.వి రాజు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం” రాజధాని రౌడీ”. ఈ చిత్రం జూన్ 14న విడుదల కు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత సంతోష్ కుమార్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు, మద్యపానం బారినపడి, నలుగురు యువకులు తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారు అనే కధాంశంతో తెరకెక్కిన చిత్రం “రాజధాని రౌడీ”. వినోదానికి, సందేశాన్ని జోడించి రూపొందిన చిత్రమిది. చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ, ఆలోచన రేకెత్తించే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీస్ గా అద్భుతమైన నటన ప్రదర్శించారు. ముమైత్ ఖాన్ తన అందాలతో కనువిందుచేస్తారు. అర్జున్ జన్య అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇలాంటి మంచి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది. అత్యధిక థియేటర్లలో ఈనెల 14న విడుదల చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
ప్రస్తుతం మన తెలుగు సినిమా ఖ్యాతి, తెలుగు హీరోల స్థాయి ప్రపంచ దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఇక మ్యాన్…
దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ జనవరి 9, 2026న విడుదల కాబోతోందని మేకర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ…
Megastar Chiranjeevi has yesterday ( 19 March 2025 ) added another jewel to his crown……
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘జాక్ - కొంచెం క్రాక్’. వైష్ణవి…
టాలీవుడ్‌లో నిర్మాతగా దిల్ రాజుకి ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే…
ఖురేషి అబ్‌రామ్ యొక్క చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టండి: మార్చి 20న మలయాళ సూపర్‌స్టార్, కంప్లీట్‌యాక్టర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్…