మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మోస్ట్ ప్రెస్టీజియస్ 50వ మైల్ స్టోన్ మూవీ ‘మహారాజ’రిలీజ్ కి రెడీ అయ్యింది. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనురాగ్ కశ్యప్ పవర్ ఫుల్ రోల్ లో నటించారు. విజయ్ సేతుపతికి ఇది 50వ సినిమా కావడంతో మెమరబుల్ హిట్ అందించడం కోసం దర్శకుడు చాలా కేర్ తీసుకున్నాడు. నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌ని హ్యుజ్ బడ్జెట్ తో లావిష్ గా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎన్‌విఆర్ సినిమా ఈ మూవీని ఏపీ, తెలంగాణలలోమ్యాసీవ్ గా రిలీజ్ చేయనుంది. ఈ సినిమా జూన్ 14న థియేట్రికల్ రిలీజ్ కానున్న నేపధ్యంలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా రామోజీరావు గారికి అంజలి ఘటిస్తున్నాను. ఆయన మృతి ఎంతో బాధకలిగించింది. హైదరాబాద్‌తో కంటే రామోజీ ఫిల్మ్‌సిటీతోనే నాకు మోమోరిస్ ఉన్నాయి. 2005లో ధనుష్ సినిమా కోసం తొలిసారి ఫిల్మ్‌సిటీకి వెళ్లాను. సినిమాకు సంబంధించి ఏం కావాలో అవన్నీ ఫిల్మ్‌సిటీలో కనిపించడం చూసి స్టన్ అయిపోయాను. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది దర్శకులు మంచి సినిమాలు తీస్తున్నారంటే అందులోని సదుపాయాలే కారణం. రామోజీరావు గారి విజన్‌కు ఫిల్మ్‌సిటీనే నిదర్శనం. సినిమా పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు.
పిజ్జా ప్రమోషన్స్ కి ఇక్కడికి వచ్చాను. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ హైదరాబాద్ ప్రమోషన్స్ కి రావడం ఆనందంగా వుంది. మహారాజ 50వ సినిమా. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ తో వున్నాం. ఈ సినిమాని చాలా మందికి చూపించాం. చూసిన అందరికీ నచ్చింది. తెలుగు ప్రేక్షకులందరూ సినిమాని ఇష్టపడతారనే నమ్మకం వుంది. జూన్ 14న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమాని చూడాలి’ అని కోరారు.
హీరోయిన్ మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ.. తమిళ్ లో కొంత బ్రేక్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో భాగం కావడం గర్వంగా వుంది. చాలా మంచి స్క్రిప్ట్ ఇది. యూనిక్ స్క్రీన్ ప్లే. ఇలాంటి సినిమా ఈ మధ్య కాలంలో చూడలేదు. ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. సేతు గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా వుంది. అలాగే అనురాగ్ గారితో వర్క్ చేయడం కూడా గ్రేట్ ఎక్స్ పీరియన్స్. డైరెక్టర్ చాలా యునిక్ గా తీశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు.
డైరెక్టర్ నితిలన్ సామినాథన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మాది చిత్తూరు పక్కన చిన్న విలేజ్. చిన్నప్పటినుంచి చిరంజీవి సర్, బాలకృష్ణ సర్, నాగార్జున సర్ ఇలా అందరి సినిమాలు చూస్తూ పెరిగాను. విజయ్ సేతుపతి గారి యాభైవ సినిమాతో మీ అందరినీ కలుసుకోవడం ఆనందంగా వుంది. తెలుగు ప్రేక్షకులు సినిమా అంటే చాలా ఇష్టం, పాషన్. ఎన్వీ ప్రసాద్ గారితో పాటు అందరికీ థాంక్స్’ చెప్పారు.
అభిరామి మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తర్వాత తెలుగు సినిమాతో ఇక్కడి రావడం ఆనందంగా వుంది. మంచి కథ, మాస్ ఎలిమెంట్స్, ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో వున్నాయి. అన్నిటికిమించి విజయ్ సేతుపతి గారు వున్నారు. డైరెక్టర్ అద్భుతంగా తీశారు. ఇందులో మంచి పాత్ర చేశాను. ఇంత మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం ఆనందంగా వుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలి’ అని కోరారు.
డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన ఎన్వీ ప్రసాద్ గారికి, సురేష్ గారికి, విజయ్ సేతుపతి గారి థాంక్స్. ఈ సినిమా చూశాను. ఇందులో విజయ్ సేతుపతి గారి నటవిశ్వరూపం చూస్తారు. సినిమా అద్భుతంగా వుంటుంది. తప్పకుండా ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అన్నారు.
నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. మీడియా దిగ్గజం, సినిమా పరిశ్రమకు ఎన్నో గొప్ప సినిమాలు అందించిన రామోజీరావు గారికి మా యూనిట్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన సినిమాకి అందించిన సేవలు మరువలేని. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటు.
‘మహారాజ’లో ఫ్యామిలీ ఎమోషన్ వుంది. మాస్ వుంది క్లాస్ వుంది. విజయ్ సేతుపతి గారి నటన మరోస్థాయిలో వుంటుంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యే సినిమా. ఖచ్చితం సినిమాని ఆదరిస్తారనే నమ్మకం వుంది. మంచి సినిమా చుశామనే తృప్తిని ఇస్తుంది. విజయ్ సేతుపతి గారి నటవిశ్వరూపం వుంటుంది’ అన్నారు.
నటీనటులు: విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి (నటరాజ్), భారతీరాజా, అభిరామి, సింగంపులి, అరుల్దాస్, మునిష్కాంత్, వినోద్ సాగర్, బాయ్స్ మణికందన్, కల్కి, సచన నమిదాస్
టెక్నికల్ సిబ్బంది:
రచన & దర్శకత్వం: నితిలన్ సామినాథన్
నిర్మాతలు : సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి
అసోసియేట్ ప్రొడ్యూసర్: కమల్ నయన్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్
తెలుగు రిలీజ్: NVR సినిమాస్
మ్యూజిక్: బి అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
ప్రొడక్షన్ డిజైనర్ : వి.సెల్వకుమార్
స్టంట్ డైరెక్టర్: అన్ల్ అరసు
డైలాగ్స్: నితిలన్ సామినాథన్, రామ్ మురళి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎ. కుమార్
తెలుగు డబ్బింగ్: పోస్ట్‌ప్రో వసంత్
సౌండ్ డిజైన్: అరుణ్ ఎస్ మణి (ఓలి సౌండ్ ల్యాబ్స్)
సౌండ్ మిక్సింగ్: M.R రాజకృష్ణన్ (R.K స్టూడియోస్)
కాస్ట్యూమ్ డిజైనర్: దినేష్ మనోహరన్
మేకప్ ఆర్టిస్ట్: AR అబ్దుల్ రజాక్
కాస్ట్యూమర్: S. పళని
కలరిస్ట్: సురేష్ రవి
స్టిల్స్ : ఆకాష్ బాలాజీ
సబ్ టైటిల్స్ : ప్రదీప్ కె విజయన్
స్టోరీబోర్డింగ్: స్టోరీబోర్డ్ చంద్రన్
VFX: పిక్సెల్ లైట్ స్టూడియో
DI: మంగో పోస్ట్
పబ్లిసిటీ డిజైనర్: చంద్రు (తండోరా)
పీఆర్వో(తమిళం): సురేష్ చంద్ర, రేఖ డి’వన్
పీఆర్వో (తెలుగు): వంశీ-శేఖర్
మార్కెటింగ్ టీమ్ (తెలుగు) – ఫస్ట్ షో
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : కె. శక్తివేల్, సుసి కామరాజ్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…