రాజ్ తరుణ్ ‘భలే ఉన్నాడే’ హిలేరియస్ ట్రైలర్ రిలీజ్

యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అమ్మాయిలంటే ఆమడ దూరంలో వుండే హీరో పాత్రని హిలేరియస్ గా పరిచయం చేస్తూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. రాజ్ తరుణ్ , మనీషా కంద్కూర్ ల మధ్య వచ్చే సన్నివేశాలు, వారి లవ్ స్టొరీ చాలా ఎంటర్ టైనింగ్ గా వున్నాయి. ట్రైలర్ లో ఫన్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి.

డైరెక్టర్ జె శివసాయి వర్ధన్ ఒక యూనిక్ సబ్జెక్ట్‌ని ఎంచుకుని, రాజ్ తరుణ్‌ని డిఫరెంట్ అండ్ హిలేరియస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేశారు. ఇలాంటి డేరింగ్ అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నందుకు రాజ్ తరుణ్ ని అభినందించాలి.  రాజ్ తరుణ్ పెర్ ఫార్మెన్స్, తన కామిక్ టైమింగ్ అద్భుతంగా వున్నాయి. మనీషా కంద్కూర్ తన గ్లామర్ అండ్ నటనతో ఆకట్టుకుంది.  టీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్స్, వారి టైమింగ్ చూస్తుంటే సినిమాలో ఎంటర్ టైమెంట్ అదిరిపోతుందని అర్ధమౌతోంది.  

నగేష్ బనెల్లా కెమెరా వర్క్ బ్రిలియంట్ గా వుంది, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫన్ ని మరింత ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్యాలిటీలో వున్నాయి. మొత్తనికి హిలేరియస్ ట్రైలర్ సినిమాపై చాలాక్యురియాసిటీని పెంచింది.  

ఈ చిత్రానికి బి గోవిందరాజు, ముక్కర మురళీధర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ ఎడిటర్, సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్, శివ కుమార్ మచ్చ ప్రొడక్షన్ డిజైనర్.

వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్, సింగీతం శ్రీనివాస్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, రాచా రవి, సుదర్శన్, శ్రీనివాస్ వడ్లమాని, మణి చందన, పటాస్ ప్రవీణ్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: జె శివసాయి వర్ధన్
ప్రెజెంట్స్: మారుతీ టీమ్
నిర్మాత: N.V కిరణ్ కుమార్
బ్యానర్: రవికిరణ్ ఆర్ట్స్
DOP: నగేష్ బానెల్లా
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్
ఆర్ట్: సురేష్ భీమగాని
ప్రొడక్షన్ డిజైనర్: శివ కుమార్ మచ్చ
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago