టాలీవుడ్

రహస్యం ఇదం జగత్‌ కూడా అందరిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది

ఇటీవల తమ ప్రమోషన్‌ కంటెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్స్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నేటి తరం ప్రేక్షకులను అలరించే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వున్నాయని ఈ చిత్రం ప్రమోషన్‌ కంటెంట్‌ చూస్తే అర్థమవుతోంది. మన పురాణాలు, ఇతిహాసాల గురించి… శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. నవంబరు 8న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను అమెరికాలోని డల్లాస్‌లో విడుదల చేశారు. ఆ టీజర్‌కు అందరి నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు కోమల్‌ ఆర్‌.భరద్వాజ్‌ మాట్లాడుతూ సైన్స్‌ ఫిక్షన్‌కు మైథాలాజికల్‌ అంశాలు జోడించి నేటి తరం ప్రేక్షకులను మెప్పు పొందే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఆడియన్స్‌ ఇంట్రెస్ట్‌ కలిగించే అంశాలతో పాటు స్టనింగ్‌ వుండే విజువల్స్‌ కూడా ఈ చిత్రంలో వుంటాయి. ఈ సినిమా గ్లింప్స్‌, టీజర్‌ చూసి అందరూ అభినందిస్తున్నారు. శ్రీ చక్రం ప్రేరణతో ఈ కథను తయారుచేశాను. చాలా ఎఫర్ట్‌ పెట్టి తీశాం. ఫిల్మ్‌ స్కూల్‌ నేపథ్యం నాది. అప్పుడే చాలా అవార్డుల అందుకున్నాను. కల్కి, హనుమాన్‌, కార్తికేయలా ఇది మైథలాజికిల్‌ సినిమా. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం ద్వారా మన పురాణాల గురించి, మన మూలాల గురించి ఓ కొత్త విషయాన్ని చెప్పబోతున్నాం. పూర్తిగా అమెరికాలో చిత్రీకరించి 1998లో పడమటి రాగం, ఆ తరువాత వెన్నెల వచ్చింది. 20 సంవత్సరాల తరువాత ఈ సినిమా వస్తుంది. ఈ జనరేషన్‌కు నచ్చే సినిమా ఇది. ఇండియన్‌ మైథలాజి ప్రేరణతో ఈ కథను తయారుచేశాం. అందరిని మెప్పించే కంటెంట్‌ ఈ సినిమాలో వుంది. అదే నమ్మకంతో మేము వస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం అందరిన్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి సర్‌ఫ్రైజ్‌ చేస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు.

హీరోయిన్‌ మానస మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కోమల్‌ గారికి థ్యాంక్స్‌. అమెరికాలో ఫుల్‌టైమ్‌ పనిచేస్తూ సినిమా పట్ల పాషన్‌ వున్న యూఎస్‌లో వున్న వాళ్లకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్క్షతలు. అందరం ఎంతో తపనతో చేసిన సినిమా ఇది. తప్పకుండా మీరందరు సినిమాను ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం వుంది’ అన్నారు.

మరో కథానాయిక స్రవంతి పత్తిపాటి మాట్లాడుతూ ఓ మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు నాకు ఆనందంగా వుంది. యూఎస్‌లో వుండే నేను ఈ రోజు మీ ముందు వున్నానంటే దర్శకుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమే కారణం. టీజర్‌ అందరికి ఎంతో నచ్చింది. తప్పకుండా సినిమాను కూడా ఆదరిస్తారనే నమ్మకం వుంది’ అన్నారు.

గీత రచయిత రాంబాబు గోసాల మాట్లాడుతూ ”ఆడియన్స్‌ను రహస్యం ఇదం జగత్‌ కొత్త ప్రపంచంలోకి తీసుకెవెళుతంది. న్యూ జోనర్‌ సినిమా. మా బుల్లి తమన్ గ్యానీ మంచి సంగీతం అందించాడు. నేను ఓ మంచి పాట రాశాను తప్పకుండా చిత్రం కూడా అందరిని నచ్చుతుంది’ అన్నారు.

మరో గీత రచయిత రమేష్‌ మాట్లాడుతూ కోమల్‌ గారు మంచి అభిరుచి గల దర్శకుడు. టీజర్‌ చూడగానే ఇదొక సమ్‌థింగ్‌ డిఫరెంట్ సినిమాలా అనిపించింది. ఈ చిత్రంలో ఓ మంచి పాట రాశాను అని తెలిపారు.

సంగీత దర్శకుడు గ్యానీ మాట్లాడుతూ : రహస్యం ఇదం జగత్‌ వన్‌ ఇయర్‌ బ్యాక్‌ స్టార్‌ చేశాం. వెరీ బిగ్‌ థింగ్‌. తప్పుండా ఈ సినిమా కంటెంట్‌ అందరికి తప్పకుండా నచ్చుతుంది. అనే నమ్మకం వుంది’ అన్నారు.

తారాగణం: రాకేష్ గలేభే, స్రవంతి ప్రత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ కందాల, శివ కుమార్ జూటూరి, ఆది నాయుడు, ఏబెల్ కోసెంటినో, టామ్ అవిలా, లాస్య రవినూతుల.
కోమల్ ఆర్ భరద్వాజ్: రచన & దర్శకత్వం
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: టేలర్ బ్లూమెల్
సంగీతం: గ్యాని
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
రచయిత: రవితేజ నిట్ట
డైరెక్షన్ టీమ్: వరుణ్ వేగినాటి, రవితేజ నిట్టా, భార్గవ్ గోపీనాథం, నవ్య దీపికా భత్తుల, ఆశిష్ చైతన్య, అనీషా క్రోతపల్లి
బ్యానర్: సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్
నిర్మాతలు: పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల
ప్రొడక్షన్ డిజైనర్: జెఫ్రీ స్టిల్వెల్
సినిమాటోగ్రఫీ బృందం: టేలర్ స్టంప్, మైఖేల్ వీస్, డామియన్ బైంగ్టన్, జెస్సీ బర్రిల్, నిక్ గ్రిల్, , పాట్రిక్ బ్లెవిన్స్, లోగాన్ రేనాల్డ్స్.
హెయిర్ & మేకప్: ఎరిన్ లియోన్, ట్రిస్టా కెల్లీ, ఎలెన్ మక్ర్ట్చ్యాన్
సౌండ్ రికార్డింగ్: నికోలస్ డెకర్, ట్రాయ్ మిచెయు
కాస్ట్యూమ్ డిజైనర్: అనురాధ సాగి
VFX కంపెనీ/సూపర్‌వైజర్: హ్యూ పిక్చర్స్/హేమంత్ వుండేమొదలు
యానిమేషన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్: డి స్క్వేర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్/విజయ్ సాగర్ అన్నారపు
లేబుల్: డివో మ్యూజిక్
పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ తో హీటెక్కిన డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ షో

ఓంకార్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సెన్సేషనల్ డ్యాన్స్ షో డ్యాన్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్…

9 hours ago

Dance IKON Season 2 turns into revenge-fueled battle as nominations heat up

HYDERABAD – The second episode of Dance IKON Season 2: Wildfire delivered an unexpected twist,…

9 hours ago

హరీశ్ శంకర్ చేతుల మీదుగా “అందెల రవమిది” సినిమా టీజర్ రిలీజ్

ఇంద్రాని దవులూరి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా అందెల రవమిది. ఈ చిత్రాన్ని శివ భట్టిప్రోలు సమర్పణలో…

9 hours ago

దిల్ రాజు చేతుల మీదుగా ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి ‘రెడ్డి మామ’ అంటూ సాగే మాస్ సాంగ్ విడుదల

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ…

13 hours ago

Dil Raju Launched Mass Folk Song From Barabar Premistha

Attitude Star Chandra Hass is coming up with a rustic love and action entertainer Barabar…

13 hours ago

Melody Song ‘O Prema Prema’ Released from “Artiste”

Santhosh Kalwacherla and Krisheka Patel play the lead roles in "Artiste", which is produced by…

14 hours ago