కొత్తదనంతో కూడిన చిత్రాలను, వైవిధ్యమైన కథలను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. ఇక వాళ్లతో ఆసక్తిని కలిగించే సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్స్ అంటే.. అందునా మన పురాణాలు, ఇతిహాసాల గురించి ఏదైనా అంశంతో రూపొందిన చిత్రమంటే ఎంతో ఆసక్తితో చూస్తారు. సరిగ్గా అలాంటి జానర్‌లోనే రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్. రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం రహస్యం ఇదం జగత్. సింగిల్ సెల్ యూనివర్శ్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది.
చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం డేట్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నవంబరు 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా ఈ గ్లింప్స్‌లో ప్రకటించారు. కాగా ఈ గ్లింప్స్‌ను చూస్తుంటే.. మన పురాణాలు, ఇతిహాసాల్లోని ఆసక్తికరమైన పాయింట్‌ను తీసుకొని ఈ చిత్రం రూపొందించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మన శ్రీచక్రం గురించి చెబుతున్న పాయింట్ అందరికి గూజ్‌బంప్స్ తీసుకొచ్చే విధంగా వుంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని ఈ గ్లింప్స్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మాసస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ కండాల, శివకుమార్ జుటూరి, ఆది నాయుడు, లాస్య రావినూతుల తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: టైలర్ బ్లుమెల్, సంగీతం: గ్యానీ, ఎడిటర్: చోటా.కె.ప్రసాద్, రైటర్: రవితేజ నిట్ట, సహ నిర్మాతలు: రాకేష్ గలేబి, కోమల్ రావినూతుల ఎగ్జక్యూటివ్ నిర్మాత: హరీష్ రెడ్డి గుండ్లపల్లి , అసోసియేట్ నిర్మాతలు: విన్సెంట్ ఫామ్, జాన్ షా నిర్మాతలు పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల, రచన-దర్శకత్వం: కోమల్ ఆర్ భరద్వాజ్
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…