రహస్యం ఇదం జగత్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ గ్లింప్స్‌

Must Read

కొత్తదనంతో కూడిన చిత్రాలను, వైవిధ్యమైన కథలను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. ఇక వాళ్లతో ఆసక్తిని కలిగించే సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్స్‌ అంటే.. అందునా మన పురాణాలు, ఇతిహాసాల గురించి ఏదైనా అంశంతో రూపొందిన చిత్రమంటే ఎంతో ఆసక్తితో చూస్తారు. సరిగ్గా అలాంటి జానర్‌లోనే రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది.

చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం డేట్‌ అనౌన్స్‌మెంట్‌ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నవంబరు 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా ఈ గ్లింప్స్‌లో ప్రకటించారు. కాగా ఈ గ్లింప్స్‌ను చూస్తుంటే.. మన పురాణాలు, ఇతిహాసాల్లోని ఆసక్తికరమైన పాయింట్‌ను తీసుకొని ఈ చిత్రం రూపొందించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మన శ్రీచక్రం గురించి చెబుతున్న పాయింట్‌ అందరికి గూజ్‌బంప్స్‌ తీసుకొచ్చే విధంగా వుంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని ఈ గ్లింప్స్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మాసస వీణ, భార్గవ్‌ గోపీనాథం, కార్తీక్‌ కండాల, శివకుమార్‌ జుటూరి, ఆది నాయుడు, లాస్య రావినూతుల తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: టైలర్‌ బ్లుమెల్‌, సంగీతం: గ్యానీ, ఎడిటర్‌: చోటా.కె.ప్రసాద్‌, రైటర్‌: రవితేజ నిట్ట, సహ నిర్మాతలు: రాకేష్‌ గలేబి, కోమల్‌ రావినూతుల ఎగ్జక్యూటివ్‌ నిర్మాత: హరీష్‌ రెడ్డి గుండ్లపల్లి , అసోసియేట్‌ నిర్మాతలు: విన్సెంట్‌ ఫామ్‌, జాన్‌ షా నిర్మాతలు పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల, రచన-దర్శకత్వం: కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌

Latest News

Rocking Star Yash appeals A heartfelt letter ahead of his birthday

Rocking Star Yash, who rose to global stardom with the KGF franchise, has always enjoyed a special bond with...

More News