రాఘవ లారెన్స్, కతిరేసన్ ‘రుద్రుడు’ గ్లింప్స్ విడుదల

నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ కధానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌’రుద్రుడు’. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. నిర్మాతలు సినిమా విడుదలకు సరైన స్లాట్‌ని ఎంచుకున్నారు. రుద్రుడు 2023లో ఏప్రిల్ 14న వేసవిలో థియేటర్స్ లో అలరించనుంది.రాఘవ లారెన్స్ బర్త్ డే కానుకగా ‘రుద్రుడు’ భారీ యాక్షన్ గ్లింప్స్ ని విడుదల చేశారు మేకర్స్. లారెన్స్ కంప్లీట్ ట్రాన్స్ ఫార్మ్మేషన్ లో రగ్గడ్ లుక్ లో కనిపించారు. ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్స్ క్రియేటడ్ అనే ట్యాగ్ లైన్  సినిమాలో లారెన్స్ పాత్రని తెలియజేస్తింది. 

యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. జి.వి. ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం యాక్షన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. కెమరాపనితనం బ్రిలియంట్ గా వుంది. ఈ గ్లింప్స్ యాక్షన్ ని ఇష్టపడే వారిని ఆకట్టుకుంటుంది.ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పిస్తున్నారు.ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు.రుద్రుడు ఏప్రిల్  14,2023న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్  కానుంది.

తారాగణం: రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు

సాంకేతిక విభాగం:

దర్శకత్వం – కతిరేశన్

నిర్మాత- కతిరేశన్

బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ

సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్

డీవోపీ : ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి

ఎడిటర్: ఆంథోనీ

స్టంట్స్: శివ – విక్కీ

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

1 day ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

1 day ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

1 day ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago