1980’s లో రాదే కృష్ణ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్

Must Read

ఎస్ వి క్రియేషన్స్ బ్యానర్ పై ఊడుగు సుధాకర్ నిర్మాతగా ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఎస్ ఎస్ సైదులు హీరోగా భ్రమరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా ఎం ఎల్ రాజా సంగీత దర్శకత్వంలో వస్తున్న సినిమా రాదే కృష్ణ. ఈ సినిమాని తెలుగు మరియు బంజారా రెండు భాషల్లో విడుదల చేస్తున్నారు. నేడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు, నిర్మాత రామ్ తల్లూరి గారు, హీరో సోహెల్ మరియు ఆటో రాంప్రసాద్ విచ్చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత రామ్ తల్లూరి గారు మాట్లాడుతూ : ఇది మా జిల్లాలో తీసిన సినిమా. సినిమా టీజర్ బాగుంది పాటలు చాలా బాగున్నాయి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమా నిర్మాతకి డబ్బులు నటీనటులకి మంచి పేరు తీసుకురావాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు మాట్లాడుతూ : చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి నేను ఎప్పుడూ ముందు ఉంటాను. ఈ సినిమా నేను చూసినప్పుడు క్లైమాక్స్లో ఇలా కాకుండా వేరేలా చేసి ఉంటే బాగుండేది అని చెప్పాను. చెప్పిన వెంటనే రైటర్స్ మరియు టీమ్ అంతా వచ్చి సజెషన్ తీసుకొని మళ్లీ మూడు రోజులు షూట్ చేసి ఎడిట్ చేసి సినిమా తీసుకొచ్చారు. దానివల్ల అర్థమవుతుంది తెలుగు సినిమా అంటే ఎంత పిచ్చి అని. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ సినిమా తీశారు. వెల్ కష్టానికి తగిన ప్రతిఫలం మంచి సక్సెస్ రూపంలో తగ్గాలని ప్రొడ్యూసర్ కి డబ్బులు, పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో సోహెల్ మాట్లాడుతూ : ఈ సినిమా టీం నాకు ఫ్యామిలీ లాంటిది. మా సైదుల్ని నిర్మాతని టీం ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. సినిమా అంటే రంగుల ప్రపంచం అంటారు కానీ మీకు రంగులు చూపిస్తూ మేము బ్లాక్ అండ్ వైట్ లో ఉండిపోతాము. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. జనాలకి ఏ సినిమా నచ్చుతుందో ఏ సినిమా నచ్చదో తెలియదు. కానీ మాకు తెలిసింది హిట్ అయిన ఫ్లాప్ అయిన సినిమా చేయడం ఒకటే. ఈ సినిమా టీం కూడా అదే పట్టుదలతో మంచి సినిమా చేశారు. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది మంచి సక్సెస్ అవుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ : నిజానికి ఈ సినిమాకి నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ గోపి గారు ఫోన్ చేసి ఈవెంట్ కి నన్ను ఆహ్వానించారు. టీజర్ చాలా బాగుంది. కచ్చితంగా ఈ సినిమా ఈ టీం కి మంచి పేరు సక్సెస్ తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

కథా రచయిత రాజేష్ మాచర్ల మాట్లాడుతూ : ఈ ఈవెంట్ కి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన బెక్కం వేణుగోపాల్ గారికి, హీరో సోహెల్ గారికి, రామ్ తల్లూరి గారికి, ఆటో రాంప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చిన్న సినిమా అయిన ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అన్న నమ్మకం నాకుంది. థియేటర్లలో ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తారు అన్నారు.

నిర్మాత ఊడుగు సుధాకర్ గారు మాట్లాడుతూ : ఎంతో బిజీగా ఉండి కూడా సపోర్ట్ చేయడానికి వచ్చిన బెక్కం వేణుగోపాల్ గారికి, హీరో సోహెల్ గారికి, రామ్ తల్లూరి గారికి, ఆటో రాంప్రసాద్ గారికి కృతజ్ఞతలు. రామ్ తల్లూరి గారు ముందు నుంచి నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా బెక్కం వేణుగోపాల్ గారు చెప్పిన మార్పుల్ని బడ్జెట్ చూసుకోకుండా చేశాము. టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన తనికెళ్ల భరణి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులు ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో ఎస్ ఎస్ సైదులు మాట్లాడుతూ : ఈ సినిమా కోసం కష్టపడిన మా టీమ్ అందరికీ ధన్యవాదాలు. చిన్న సినిమా అయినా సపోర్ట్ చేయడానికి వచ్చిన రామ్ తల్లూరి గారికి, బెక్కం వేణుగోపాల్ గారికి, సోహెల్ గారికి, ఆటో రాంప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంచి సర్ప్రైజ్ ఉంది. కచ్చితంగా అందరికీ సినిమా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

హీరోయిన్ భ్రమరాంబికా మాట్లాడుతూ : చిన్న సినిమా అయినా సపోర్ట్ చేయడానికి వచ్చిన మా అతిధులకి కృతజ్ఞతలు. టీజర్ కి తనికెళ్ల భరణి గారి వాయిస్ చాలా ప్లస్ అయింది. ఆయన వాయిస్ ఓవర్ వల్లే చాలామందికి మా టీజర్ రీచ్ అవుతోంది. 1980లో రాదే కృష్ణ అప్పటి సిచువేషన్స్ కి తగినట్టు ఈ సినిమాని తీశారు డైరెక్టర్ ఇస్మాయిల్ గారు. విజువల్ గా పాషా గారు ఇంకా బాగా చూపించారు. మ్యూజిక్ అండ్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

దర్శకుడు ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ : సినిమా పూర్తయింది టీజర్ ఎవరితో చేయించాలి అనుకున్నప్పుడు తనికెళ్ల భరణి గారు వాయిస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఆయన్ని అప్రోచ్ అవ్వడానికి సపోర్ట్ చేసిన మహేంద్ర సింగ్ మాస్టర్ గారికి కృతజ్ఞతలు. ఆయన వాయిస్ తో టీజర్ కి ఒక కొత్త ఫీల్ వచ్చింది. అదేవిధంగా బెక్కం వేణుగోపాల్ గారు క్లైమాక్స్ కి చేసిన సజెషన్స్ బాగా హెల్ప్ అయ్యాయి. అదేవిధంగా రామ్ తల్లూరి గారు ముందరించి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎంతో బిజీగా ఉండే కూడా ఈవెంట్ కి వచ్చి సపోర్ట్ చేస్తున్న హీరో సోహెల్ గారికి ఆటో రాంప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రేక్షకులందరూ ఈ సినిమాని చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

నటీనటులు : ఎస్ ఎస్ సైదులు, భ్రమరాంబిక, అర్పిత లోహి తదితరులు

టెక్నీషియన్స్ :
నిర్మాణం : ఎస్ వి క్రియేషన్స్
నిర్మాత : ఊడుగు సుధాకర్
డిఓపి : ఇలియాస్ పాషా
మ్యూజిక్ : ఎం ఎల్ రాజా
దర్శకుడు : ఇస్మాయిల్ షేక్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పిఆర్ఓ : మధు VR

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News