రాయన్ నుంచి మాస్ నంబర్ తల వంచి ఎరగడే పాట విడుదల
నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ యాక్టర్ గా తన 50వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కిషన్ మరో లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ ‘రాయన్’. కాళిదాస్ జయరామ్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
తల వంచి ఎరగడే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేయడం ద్వారా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎఆర్ రెహమాన్ మాస్ నంబర్‌ను కంపోజ్ చేశారు, పాటని గ్రాండ్‌గా చిత్రీకరించారు. ధనుష్ ఒక కార్నివాల్‌లో చాలా మంది గ్రామస్తులతో కలిసి మాస్ డ్యాన్స్‌లు చేస్తూ కనిపించారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ లిరిక్స్‌తో హేమచంద్ర, శరత్ సంతోష్ పవర్ ఫుల్ గా పాడిన ఈ పాటకు ప్రభుదేవా అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు.
ఈ పాట అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది, ప్రత్యేకించి మాస్‌కు బాగా నచ్చుతుంది. ఈ చిత్రంలో ధనుష్ హ్యాండిల్‌బార్ మీసాలతో షార్ట్ హెయిర్ తో కనిపిస్తున్నారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించడానికి తల వంచి ఎరగడే పాట పర్ఫెక్ట్.
ఫస్ట్‌క్లాస్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో హై టెక్నికల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్‌జె సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, ధుషార విజయన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఓం ప్రకాష్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రసన్న జికె ఎడిటర్ గా, జాకీ ప్రొడక్షన్ డిజైనర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
జూన్ 13న ప్రపంచ వ్యాప్తంగా రాయన్‌ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనుంది.
తారాగణం: ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, SJ సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, దుషార విజయన్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ధనుష్
నిర్మాత: సన్ పిక్చర్స్
తెలుగు విడుదల: ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి
సంగీతం: ఏఆర్ రెహమాన్
డీవోపీ: ఓం ప్రకాష్
ఎడిటర్: ప్రసన్న జికె
ప్రొడక్షన్ డిజైనర్: జాకీ
యాక్షన్ కొరియోగ్రాఫర్: పీటర్ హెయిన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రేయాస్ శ్రీనివాసన్
పీఆర్వో: వంశీ-శేఖర్
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…