రాజు బోనగాని దర్శకత్వంలో భరత్ రామ్ ను హీరో గా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న సినిమా ‘ఏ రోజైతే చూశానో నిన్ను’

Must Read

చెక్, బుర్రకథ, రంగ రంగ వైభవంగా వంటి సినిమాల్లో చైల్డ్ హీరోగా నటించిన భరత్ రామ్ హీరోగా ఇనావర్స్ సినిమా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ నుంచి స్క్రీన్ ప్లే మరియు విజువల్ ఎఫెక్ట్స్ లో సుపరిచితుడు అయిన రాజు బొనగాని దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఏ రోజైతే చూశానో నిన్ను’.

గతంలో మహెష్ బాబు, నాగర్జున, రవితేజ, హీరోలుగా ఇనావర్స్ సినిమా ఫ్యాక్టరీ నుంచి ఎన్నో విజయవంతమైన సినిమాలు రాగా ఇప్పుడు భరత్ రామ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ జరుగుతున్నాయి. అతి త్వరలో హీరోయిన్ ను కూడా ఎంపిక చేసి డిసెంబర్లో షూట్ మొదలుపెడుతున్నట్టుగా మేకర్స్ తెలిపారు.

Latest News

వైభవంగా జరిగిన హీరో సతీష్ జై కుమార్తె ‘నైరా ‘ పుట్టినరోజు వేడుక

అంతకుమించి చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ ల కుమార్తె "నైరా" మొదటి పుట్టినరోజు వేడుకలు ఇటీవల హైదరాబాద్ రాక్ హైట్స్ లో...

More News