పుష్ప- 2 ది రూల్‌ ఫస్టాఫ్‌ లాక్‌ డిసెంబరు 6న విడుదల

Must Read

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్ చిత్రం పుష్ప-2 దిరూల్‌. పుష్ప దిరైజ్‌ సాధించిన బ్లాకబస్టర్ విజయమే అందుకు కారణం. ఆ చిత్రంలోని ప్రతి అంశం సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పుష్ప-2 గురించి ప్రతి అంశం సన్సేషనే.. ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా  బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్‌ ఇండియా చిత్రంగా  ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌  అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ చిత్రం ఫస్ట్‌హాఫ్‌ లాక్‌ చేశారు..

ఈ ఫస్ట్‌హాఫ్‌ అద్బుతంగా వుందని, ప్రేక్షకులు ఎంత ఊహించుకున్నా అంతకు తగ్గేదేలే లా వుందని అంటున్నారు చిత్ర యూనిట్‌ సభ్యులు. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాలెన్స్‌ షూటింగ్‌ను జరుపుకుంటునే మరోవైపు నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్‌, రెండు పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్‌ ఇండియా స్థాయిలో డిసెంబరు 6న పుష్ప-2 క్రియేట్‌ చేయబోయే రిక్డార్డుల గురించి అందరి రెడీ కావాల్సిందే. అంతేకాదు ఈ చిత్రం రిలీజ్‌క ముందే 1000 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ పూర్తిచేసిందని అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు

Crew:

Story- Screenplay-Direction: Sukumar Bandreddi
Producers: Naveen Yerneni, Ravi Shankar Yalamanchili
CEO: Cherry
Music: Devi Sri Prasad
Cinematographer: Miresłow Kuba Brożek
Production Designer: S. Ramakrishna – Monica Nigotre
Lyricist: Chandra bose

Banners: Mythri Movie Makers in association with Sukumar Writings

Marketing Head : Sharath Chandra Naidu
PROs: Eluru Srinu, Maduri Madhu
Marketing: First Show

Latest News

య‌ష్ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు 100 రోజులు మాత్రమే..సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసిన మేక‌ర్స్‌

కొత్త టెక్నిషియ‌న్స్‌ను అనౌన్స్ చేసిన టీమ్‌ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొద‌లైంది. మార్చి 19, 2026న సినిమా...

More News