ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ది రూల్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.
డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రతి ప్రమోషన్ కంటెంట్ అందరిలోనూ అంచనాలు పెంచేస్తున్నాయి. టీజర్‌తో పాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. దేవిశ్రీప్రసాద్ అత్యద్భుతమైన సంగీతానికి, చంద్రబోస్ సాహిత్యానికి.. ఆ పాటల్లో హీరో స్టెప్స్‌కి అందరూ ఫిదా అవుతున్నారు. రోజురోజు కు అంచనాలు పెంచుకుంటున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చాలా లావిష్‌గా జరుగుతుంది. ప్రస్తుతం పతాక సన్నివేశాలు అత్యంత అద్బుతంగా చిత్రీకరించే పనిలో వున్నారు. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా వుండబోతున్నాయని అంటున్నారు. అంతేకాదు రేపు థియేటర్‌లో ఈ పతాక సన్నివేశాలు గూజ్ బంప్స్ వచ్చే విధంగా వుంటాయని అంటున్నారు. సో. అల్లు అర్జున్ అభిమానులు మరో బ్లాక్‌బస్టర్ కోసం వెయిట్ చేయడమే తరువాయి అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…