పతాక సన్నివేశాల చిత్రీకరణలో పుష్ప-2 ది రూల్‌

Must Read

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ది రూల్‌ బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్‌ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రతి ప్రమోషన్‌ కంటెంట్‌ అందరిలోనూ అంచనాలు పెంచేస్తున్నాయి. టీజర్‌తో పాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. దేవిశ్రీప్రసాద్‌ అత్యద్భుతమైన సంగీతానికి, చంద్రబోస్‌ సాహిత్యానికి.. ఆ పాటల్లో హీరో స్టెప్స్‌కి అందరూ ఫిదా అవుతున్నారు. రోజురోజు కు అంచనాలు పెంచుకుంటున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చాలా లావిష్‌గా జరుగుతుంది. ప్రస్తుతం పతాక సన్నివేశాలు అత్యంత అద్బుతంగా చిత్రీకరించే పనిలో వున్నారు. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా వుండబోతున్నాయని అంటున్నారు. అంతేకాదు రేపు థియేటర్‌లో ఈ పతాక సన్నివేశాలు గూజ్‌ బంప్స్‌ వచ్చే విధంగా వుంటాయని అంటున్నారు. సో. అల్లు అర్జున్‌ అభిమానులు మరో బ్లాక్‌బస్టర్‌ కోసం వెయిట్‌ చేయడమే తరువాయి అంటున్నారు చిత్ర యూనిట్‌ సభ్యులు.

Latest News

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార...

More News