ఘనంగా ఇండియస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘పుష్ప 2 బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది. ప్రపంచమంతట కలిపి 294 కోట్లతో డే1 వసూళ్లతో రికార్డు సాధించింది. ప్రపంచమంతటా పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం దూసుకెళ్తున్న సందర్భంగా చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం అంతా ఈ ప్రెస్ మీట్ కు హాజరు కావడం జరిగింది.

ఈ సందర్భంగా నిర్మాత నవీన్ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. సినిమా రిలీజ్ అయిన తరువాత పని ఎక్కువ అయిపోయింది. అందరి దగ్గరా నుండి మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి. ఇదే ఈ చిత్ర విజయానికి నిదర్శనం. ఈ సినిమా ఎంతగా ఆదరించిన తెలుగు ప్రజలందరికీ థాంక్స్. ఫాస్టెస్ట్ 500 కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. మరింత విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఎంతటి భుజం సాధించడం భారతదేశాలందరికీ గర్వకారణం” అన్నారు.

నిర్మాత రవి మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. సినిమా ప్రీమియర్ షో చూడగానే ఇద్దరు సినిమా మాడ్నెస్ ఉన్నవాళ్ళు సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూస్తారు. రెండు రోజులకు 500 కోట్లకు పైగా సినిమా కలెక్ట్ చేసినందుకు ఆనందంగా ఉంది . అలాగే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి పేరుపేరునా మా ధన్యవాదాలు. ఇకపై థియేటర్లో టికెట్ రేట్ అందుబాటులో ఉంటుంది. అందరూ కచ్చితంగా చూడాల్సిందిగా కోరుతున్నాము” అన్నారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ… “అందరికీ థాంక్స్, ఈ సినిమాకు ఇంత విజయం ఇచ్చినందుకు. ముందుగా నేను రాజమౌళి గారికి థాంక్స్ చెప్పాలి. ఈ సినిమాను ఇంతగా ప్రోత్సహించింది రాజమౌళి గారు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయాలని రాజమౌళి గారు అన్నారు. ధియేటర్ కు వచ్చిన వాళ్ళు 3 గంటలు అంతా మర్చిపోయి సినిమాను చూడాలి అని నేను, నా చిత్ర బృందం చాల కష్టపడి చేశాం. ఫాహద్ ఫజల్ సినిమా కోసం చాల కష్టపడ్డారు. మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తితో పని చేయడం చాల అదృష్టం. అలాగే నాకు దొరికిన అసిస్టంట్ డైరెక్టర్స్ ఎవరికీ దొరికి అందరూ. వాళ్ళ జడ్జిమెంట్ కి చాల విలువ ఇస్తాను. అలాగే బయట నుండి ఒక రైటర్ని నా డైరెక్షన్ టీంలోకి తీసుకున్నాను. ఏమైనా సమస్య వచ్చినా చాల వేగంగా తీరుస్తారు. తిరుపతి నుండి గంగమ్మ తల్లి జాతరకు సంబంధించిన వారిని తీసుకొచ్చారు నా డైరెక్షన్ టీం. 10 నిమిషాలలో సీన్ రాసే వాళ్ళు ఉన్నారు దర్శకత్వం టీంలో. నా టీంలో ఉన్న వారు అంతా సుకుమార్ లే. అందరూ నాలాంటి దర్శకులే. సినిమా కోసం బాక్గ్రౌండ్ లో ఉండి పని చేసిన అందరి కష్టం నాకు తెలుసు. ఈ విజయానికి కారణం చిత్ర బృందం అందరిదీ. నా టీంలో నా అభిమానులు ఉండటం నా అదృష్టం. సినిమా ఎంత విజయం సాధిస్తుందో నా టీం ముందుగానే లెక్కలతో సహా చెప్పేశారు. హింది కూడా నా టీం మీద నమ్మకంతో పూర్తిగా వారికే అప్పగించాను. నా బృందంలో జర్నలిస్టు కూడా ఉండటం విశేషం. ఎడిటర్ కి స్క్రిప్ట్ ఎడిటింగ్ పై అవగాహన ఉండటం మాకు చాల హెల్ప్ అయింది. అలాగే చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు 3 రోజులుగా ఆనందంగా లేదు. ఎందుకంటే జరిగిన ఘటన అలాంటిది. వారి కుటుంబానికి మేము ఎప్పుడూ అండగా ఉంటాం. మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు” అన్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. దేశ నలుమూలల నుండి మాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి, భారతీయులకు, చిత్ర బృందానికి, నిర్మాతలకు, మీడియా వారికి ధన్యవాదాలు. ఒక సినిమా ఇలాంటి విజయం సాధించడానికి కారణం దర్శకుడు. కాబట్టి మా దర్శకుడు సుకుమార్ కి ధన్యవాదాలు. నన్ను ఒక స్థాయిలో పెట్టినందుకు నీకు రుణపడి ఉంటాను. సినిమా కలెక్షన్స్ చూస్తే నాకు సినిమాను ఎంత మంది ప్రేక్షకులు చూసారో అర్థం అవుతుంది. చిత్ర బృందం తరఫున, తెలుగు వారి అందరి తరుపున ప్రపంచ సినీ ప్రేక్షకులు అందరికీ నా థాంక్స్. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ బాబాయ్ గారికి, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు. అలాగే బీహార్ ప్రభుత్వానికి, పాట్నా ప్రజలకు, బీహార్ పోలీసులకు, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలకు, దేశంలో ఈ సినిమాకు సపోర్ట్ ఇచ్చిన అన్ని సినిమా ఇండస్ట్రీలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు. నేను ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం ఈ సినిమా అందరిని గర్వంగా చెప్పుకునేలా చేస్తుంది అనే నమ్మకంతోనే. అనుకోకుండా సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన మమ్మల్ని ఎంతగానో కదిలించింది. గత 20 సంవత్సరాలుగా ఇలాగే వస్తున్నాము కానీ ఆరోజు కొంచం ఎక్కువ జనం ఉండటంతో ఇబ్బంది అవుతుంది అని థియేటర్ యాజమాన్యం చెప్పగానే వెళ్ళిపోయాం. కానీ ఇంటికి వచ్చిన తరువాత రోజు జరిగిన సంఘటన తెలిసి చాల బాధ కలిగింది. మరొకసారి చెప్తున్నాను ఆ కుటుంబం కోసం 25 లక్షలు కేవలం ఒక సాయంగా అనుకుని ఇస్తున్నాము. అయినా ఒక మనిషి లేని లోటు ఎవరు తీర్చాలెం. అందుకు ఎంతో విచారిస్తున్నాను. అంత కుదుటపడిన తరువాత వ్యక్తిగతంగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలుస్తాను” అంటూ ముగించారు.

Tfja Team

Recent Posts

షూటింగ్‌ పూర్తి చేసుకున్న హ్రీం…

తెలుగు భీజాక్షరాల్లో ‘హ్రీం’ అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అనే ఒక్క భీజాక్షరంలో…

8 hours ago

యూవీ కాన్సెప్ట్స్, సంతోష్ శోభన్ “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా నుంచి ‘గాబరా గాబరా..’ లిరికల్ సాంగ్ రిలీజ్

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ…

8 hours ago

ఫిబ్రవరి 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ‘హే భగవాన్‌’

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

9 hours ago

త్వ‌ర‌లోనే నితిన్ 36వ సినిమా షూటింగ్ ప్రారంభం

నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న యూనిక్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌.. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో…

3 days ago

ప్రముఖ సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాంస్య విగ్రహవిష్కరణ

తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల…

3 days ago

రికార్డులు తిరగరాస్తున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్‌ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…

1 week ago