శ్రీ శ్రీదేవి ప్రోడక్షన్స్ బ్యానర్‌లో రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘పురుషోత్తముడు’. జోవియల్ స్టార్ రాజ్ తరుణ్, హాసిని హీరోహీరోయిన్లుగా నటించిన ‘పురుషోత్తముడు’ మోషన్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మానందం ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రేక్షకులందరికీ నమస్కారం రమేష్ తేజావత్ నిర్మాణ సారధ్యంలో రామ్ భీమన దర్శకత్వంలో నిర్మించబడిన చిత్రం పురుషోత్తముడు. టైటిల్ చాలా బాగుంది కదూ. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జస్ట్ పోస్టర్ చూస్తుంటేనే సూపర్ హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా అద్భుతమైన విజయం సాదించాలని ఆ ఏడు కొండలవాడిని కోరుకుంటున్నాను అని అన్నారు.
ఈ మూవీ రాజమండ్రిలో వేసిన భారీ సెట్లో టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా మూవీ డబ్బింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయని అలాగే హీరో రాజ్ తరుణ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన భారీ చిత్రమిది సంగీత పరంగా కుడా పెద్ద హిట్ అవుతుంది అని చిత్ర దర్శకులు రామ్ భీమన అన్నారు.
ఇక అతి త్వరలో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోందని నిర్మాతలు డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ వెల్లడించారు.
నటీనటులు:
రాజ్ తరుణ్, హాసిని సుధీర్ (నూతన పరిచయం), మురళి శర్మ, కౌసల్య, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ముఖేష్ ఖన్నా, రాజా రవీంద్ర, రాజ్ తిరన్ దాస్, అనంత్, సమీర్, సత్య, ప్రవీణ్, కవిత, విరాన్, సుభాష్, జ్వాల కోటి, రచ్చ రవి, నాగ భైరవ అరుణ్, ముక్తార్ ఖాన్, లక్ష్మణ్, కంచరపాలెం రాజు, హరిశ్చంద్ర.
*రచన & దర్శకుడు: రామ్ భీమన
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…