బ్రహ్మానందం చేతుల మీదుగా ‘పురుషోత్తముడు’ మోషన్ పోస్టర్ లాంచ్

Must Read

శ్రీ శ్రీదేవి ప్రోడక్షన్స్ బ్యానర్‌లో రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘పురుషోత్తముడు’. జోవియల్ స్టార్ రాజ్ తరుణ్, హాసిని హీరోహీరోయిన్లుగా నటించిన ‘పురుషోత్తముడు’ మోషన్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మానందం ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రేక్షకులందరికీ నమస్కారం రమేష్ తేజావత్ నిర్మాణ సారధ్యంలో రామ్ భీమన దర్శకత్వంలో నిర్మించబడిన చిత్రం పురుషోత్తముడు. టైటిల్ చాలా బాగుంది కదూ. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జస్ట్ పోస్టర్ చూస్తుంటేనే సూపర్ హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా అద్భుతమైన విజయం సాదించాలని ఆ ఏడు కొండలవాడిని కోరుకుంటున్నాను అని అన్నారు.
ఈ మూవీ రాజమండ్రిలో వేసిన భారీ సెట్లో టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా మూవీ డబ్బింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయని అలాగే హీరో రాజ్ తరుణ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన భారీ చిత్రమిది సంగీత పరంగా కుడా పెద్ద హిట్ అవుతుంది అని చిత్ర దర్శకులు రామ్ భీమన అన్నారు.
ఇక అతి త్వరలో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోందని నిర్మాతలు డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ వెల్లడించారు.

నటీనటులు:
రాజ్ తరుణ్, హాసిని సుధీర్ (నూతన పరిచయం), మురళి శర్మ, కౌసల్య, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ముఖేష్ ఖన్నా, రాజా రవీంద్ర, రాజ్ తిరన్ దాస్, అనంత్, సమీర్, సత్య, ప్రవీణ్, కవిత, విరాన్, సుభాష్, జ్వాల కోటి, రచ్చ రవి, నాగ భైరవ అరుణ్, ముక్తార్ ఖాన్, లక్ష్మణ్, కంచరపాలెం రాజు, హరిశ్చంద్ర.

*రచన & దర్శకుడు: రామ్ భీమన

  • నిర్మాతలు: DR.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బీవీ నారాయణరాజు (నాని),
  • గేయ రచయితలు: రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, అనంత శ్రీరామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, పూర్ణాచారి
  • ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
  • సంగీత దర్శకుడు: గోపి సుందర్
  • సినిమాటోగ్రఫీ: PG విందా
  • ఫైట్ మాస్టర్ : జీవన్, రాజ్ కుమార్
  • కొరియోగ్రాఫర్: సుభాష్
  • పీఆర్‌ఓ : సురేష్ కొండేటి.

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News