‘పురుష:’ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది – హీరో పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని మే 22న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో పవన్ కళ్యాణ్ మీడియాతో పంచుకున్న విశేషాలివే..

మీ నేపథ్యం గురించి చెప్పండి?

మాది పల్నాడులోని మాచర్ల దగ్గర్లోని కారంపూడి. మాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి రిలేషన్ లేదు. మా నాన్న గారు కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నారు. మా నాన్నకి నచ్చకుండా ఏ పనీ చేయను. నాకు నచ్చని ఏ పని కూడా మా నాన్న గారు చేయరు.

మీ పేరు వెనకాల ఉన్న స్టోరీ చెప్పండి? ఈ ఇండస్ట్రీలోకి రావాలన్నది ఎవరి ఆలోచన?

మా నాన్న గారు ‘గోకులంలో సీత’ సినిమా చూశారు. అప్పటికి నేను ఇంకా పుట్టలేదు. అయితే ‘తమ్ముడు’ టైంలో పుట్టాను. నాకు పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టారు. నన్ను హీరో చేయాలన్నది మా నాన్న కల. అయితే మా కాలేజ్‌లో సినిమా ఈవెంట్లు జరుగుతుండేవి. నాక్కూడా సినిమాలంటే చాలా ఇష్టం. మా నాన్న గారికి కూడా నన్ను హీరో చేయాలనే ఆశ ఉండటంతో ఇటు వైపుగా వచ్చేశాను.

నటనలో శిక్షణ తీసుకున్నారా?

వైజాగ్‌లో సత్యానంద్ గారి వద్ద యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. సర్ ఉండే కమ్యూనిటీలోనే నేను కూడా ఉన్నాను. నాలుగు నెలలు ఆయనతోనే కలిసి ఉన్నాను. ఆయన ట్రైనింగ్ మాత్రమే ఇస్తారు. రిఫరెన్సులు చేయరు. ఆయన వద్ద నేను ఎంతో నేర్చుకున్నాను.

‘పురుష:’ కథనే ఎందుకు ఎంచుకున్నారు?

డీఓపీ సతీష్ గారి వల్లే ఈ ప్రాజెక్ట్ మా దగ్గరకు వచ్చింది. సినిమాలతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాలని అనుకున్నాం. అందుకే నా మొదటి మూవీగా ఇలాంటి ఓ ఫ్యామిలీ కథతో వస్తున్నాను. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చేలా ఈ మూవీని రూపొందించాం. ఓ మంచి చిత్రాన్ని చూశామన్న ఫీలింగ్‌తో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వెళ్తారు.

సీనియర్ ఆర్టిస్టులతో కలిసి నటించడం ఎలా అనిపించింది?

‘పురుష:’లో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులున్నారు. అందరూ నాకు ఎంతో సహకరించారు. మరీ ముఖ్యంగా సప్తగిరి అన్నా, కసిరెడ్డి అన్నా ప్రతీ ఒక్క విషయంలో హెల్ప్ చేశారు. అందరి సహకారంతోనే సినిమాని చేయగలిగాను.

‘పురుష:’లో మెయిన్ పాయింట్స్ ఏంటి?

‘పురుష:’ చిత్రంలో అన్ని పాత్రలకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమాని ఆడియెన్స్ ఎంతో ఎంజాయ్ చేశారు. మా సినిమా కూడా అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుంది. ప్రతీ సీన్‌ను ఎంతో కేర్ తీసుకుని చేశాం. ఈ ప్రయాణంలో సినిమా ఆర్టిస్టుల కష్టాలన్నీ నాకు తెలిశాయి.

దర్శకుడితో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి?

వీరు అన్న నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. నేను చాలా ఇంట్రోవర్ట్‌గా ఉండేవాడ్ని. నన్ను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకు వచ్చారు. ఆయన ఇచ్చిన సహకారంతోనే సినిమాని బాగా చేయగలిగాను.

‘పురుష:’ జర్నీలో మీ సోదరి సరస్వతి ఇచ్చిన సపోర్ట్ గురించి చెప్పండి?

మా సిస్టర్ సరస్వతికి పెళ్లైంది. ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. మా సిస్టర్‌కి నేనంటే చాలా ఇష్టం. అందుకే నా కోసమే ఎక్కువ ఆలోచిస్తుంటారు. ‘పురుష:’ సినిమాలోని ప్రతీ విషయంలో ఆమె నాకు తోడుగా నిలిచారు. ఆమె సపోర్ట్ లేకపోతే ఇక్కడి వరకు వచ్చేవాడ్ని కాదు.

మీకు ఎలాంటి జానర్స్ అంటే ఇష్టం?
నా ఫ్రెండ్స్ ఎక్కువగా యాక్షన్ చిత్రాలు చేయమని సలహాలు ఇస్తుంటారు. కానీ ఏ జానర్‌లో సినిమా చేసినా కూడా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలన్నదే లక్ష్యం.

‘పురుష:’ గురించి ఆడియెన్స్‌కి ఏం చెబుతారు? నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి?

‘పురుష:’ సినిమాని ఇప్పటి వరకు చూసిన వారంతా మెచ్చుకున్నారు. కచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు. ఈ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. ఈ చిత్రం విడుదలైన తరువాత తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను.

TFJA

Recent Posts

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

20 hours ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

23 hours ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 day ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 day ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 day ago

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

3 days ago