మరోసారి పవన్ అభిమానుల మనసు గెల్చుకున్న యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

Must Read

మెగాభిమానాన్ని గుండెల నిండా నింపుకున్న యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కేెన్ మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యేలా చేస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎస్ కేఎన్…మెగా హీరోలకు మద్ధతుగా ఉండే ఎవరినైనా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాడు. ఛారిటీ యాక్టివిటీస్ లో ముందుండి మంచి పేరు తెచ్చుకున్నారు. రీసెంట్ గా జనసేన గెలవాలని కోరుకున్న ఓ మహిళకు ఆటో బహుమతిగా ఇస్తానని సోషల్ మీడియా ద్వారా మాటిచ్చాడు.

పవన్ కల్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా నడపగా వచ్చిన డబ్బులతో ఊరిలోని వారికి పార్టీ ఇస్తానని ఓ మహిళ సంతోషంగా యూట్యూబ్ ఛానెల్ తో చెప్పింది. ఆ వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ కు స్పందించిన ఎస్ కేఎన్..ఆ మహిళా అభిమాని కోరుకున్నట్లే జనసేన గెలిచాక ఆమెకు ఆటో కొనిస్తానని చెప్పాడు. ఈ ట్వీట్ కు డైరెక్టర్ మారుతి సహా పలువురు స్పందిస్తూ ఎస్ కేఎన్ ది గోల్డెన్ హార్ట్ అంటూ ప్రశంసిస్తున్నారు.

Latest News

హీరో సుడిగాలి సుధీర్ “సుధీర్స్ జోకర్” సినిమా నుంచి వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే పోస్టర్ రిలీజ్

-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్ జోకర్". బిగ్ బాస్ ఫేమ్ అయేషా...

More News