అగాధమంత బాధ నుంచి
ఆకాశమంత ప్రేమ పుడితే?
పృథ్వి పేరిచర్ల “స్కై” పోస్టర్ విడుదల
ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ముఖ్య తారాగణంగా పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో "వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్"పై నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "స్కై". "అగాధమంత బాధ నుంచి ఆకాశమంత ప్రేమ పుడితే" అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రం పోస్టర్ విడుదల చేశారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ తాలూకు తుది మెరుగులు దిద్దుకుటోంది. సుప్రసిద్ధ ఎడిటర్ సురేష్ ఆర్స్ ఈ చిత్రానికి ఎడిటింగ్ చేస్తుండడం గమనార్హం!!
"ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్టే, ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనాన్ని జయించాడా, లేదా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం పక్కవాడ్ని మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది క్లుప్తంగా "స్కై" చిత్రం కథాంశమని... రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, సురేష్ ఆర్స్ ఎడిటింగ్ "స్కై" చిత్రానికి మెయిన్ పిల్లర్స్ అని దర్శకుడు పృథ్వి పేరిచర్ల తెలిపారు!!
ఈ విభిన్న కథా చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్ - అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: కృష్ణా డిజిటల్స్, మాటలు: మురళీకృష్ణంరాజు - పృథ్వి పేరిచర్ల, సంగీతం: శివ ప్రసాద్, ఎడిటర్: సురేష్ అర్స్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, నిర్మాతలు: నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: పృథ్వి పేరిచర్ల!! లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…