ఘనంగా ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ ప్రీ రిలీజ్ ఈవెంట్..

Must Read

ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయెత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతోన్న చిత్రం రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం. వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. సంతోష్ మురారికర్ కథ అందించడమే కాకుండా కో డైరెక్టర్‌గానూ పని చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ..

డైరెక్టర్ జైదీప్ విష్ణు మాట్లాడుతూ.. ‘నాకు ఎంతో మంచి టీం దొరికింది. వారి వల్లే సినిమాను ఎంతో బాగా తీయగలిగాను. నాలుగు నెలల పాటుగా నాతోనే ఉంది. మ్యాగీ, దీక్షిత్‌లు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. వినయ్ లేటుగా వచ్చాడు. ఈ ముగ్గురూ కలిసి సినిమాను బాగా హ్యాండిల్ చేశారు. పవన్ ఈ సినిమాకు ఎడిటర్, సింగర్, డ్యాన్సర్ ఇలా మల్టీటాలెంటెడ్. సంతోష్ నా ఫ్రెండ్. పదమూడేళ్ల బంధం మాది. ఈ సినిమా జనాలకు నచ్చుతుందని, వారికి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. మా ఊరోడు సినిమా తీస్తున్నాడని, మాకు ఊరు ఊరంతా సాయం చేసింది. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఎంతో సాయం చేసింది. నా ఇద్దరు హీరోలు, హీరోయిన్లకు థాంక్స్. ఈ సినిమాకు మ్యూజిక్ విషయంలో ఇబ్బంది పడ్డాం. మణిశర్మ గారి వద్దకు వెళ్లాక ఆ సమస్య తీరిపోయింది. నాలుగు పాటలు నాలుగు రోజుల్లోనే ఇచ్చారు. లిరిక్స్ ఇచ్చిన వెంటనే పాటలు వచ్చేశాయి. కాసర్ల శ్యామ్‌ లేకపోతే మాకు మణిశర్మ గారు దొరికేవారు కాదు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నా ఇద్దరు హీరోలు వారి వారి శైలిలో ఆకట్టుకుంటారు. హీరోయిన్ పాత్రను రాసినప్పుడే తెలంగాణ అమ్మాయినే తీసుకోవాలని అనుకున్నాం. తెలంగాణ యాసలో మాట్లాడే అమ్మాయి అయితేనే బాగుంటుందని జయెత్రిని తీసుకున్నాం. మాకు ఇంత వరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియాకు థాంక్స్. మా సినిమా ఫిబ్రవరి 2న యూఎస్‌లో విడుదలవుతోంది. ఫిబ్రవరి 3న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. థియేటర్లో ఈ సినిమాను చూడండి’ అని అన్నారు.

మెలోడి బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా అంతా అయిపోయిన తరువాత నాకు ఒక విషయం అర్థమైంది. దర్శకుడు కనిపించినంత సాఫ్ట్ ఏం కాదు. మేం అంతా కలిసి కొత్తగా ట్రై చేశాం. ఆడియెన్స్ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రవీణ్ కండేలా మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో రాజన్న పాత్రను పోషించాను. మేం ఇంతకు ముందు చోర్ బజార్ అనే షార్ట్ ఫిల్మ్‌ చేశాం. ఆ తరువాత ఇండిపెండెంట్‌ సినిమా చేద్దాం అనుకున్నాం. అది చివరకు పెద్ద సినిమాగా మారింది. విలన్‌గా చేశానా? లీడ్‌గా చేశానా? అన్నది సినిమా చూశాకే అర్థం అవుతుంది. ఈ సినిమాకు మణిశర్మ గారే రెబెల్. కెమెరామెన్ శ్రీకాంత్ అరుపుల ఎంతో కష్టపడి తీశారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్నీ ఉంటాయి. సినిమా అయిపోయాక ఏడ్చుకుంటూ వస్తారు. ఇక రిజల్ట్ అనేది ఆడియెన్స్‌ చేతుల్లో ఉంది. నా భార్య దీప్తి బాలచంద్రన్‌ ఈ ప్రయాణంలో ఎంతో సహకరించారు. ఫిబ్రవరి 3న ఈ సినిమా రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

శ్రీకాంత్ రాథోడ్ మాట్లాడుతూ.. ‘నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. చిన్నతనంలోనే నటనలోకి రావాలని అనుకున్నాను. సంతోష్, జైదీప్, ప్రవీణ్ అన్నలకు థాంక్స్. ఆ ముగ్గురూ లేకపోతే ఈ సినిమా లేదు. రెండేళ్ల క్రితం ఈ ప్రయాణం మొదలైంది. ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాం. ఇక్కడకు వచ్చిన వినోద్, రాహుల్ ఇలా అందరికీ థాంక్స్. ఈ సినిమాను పూర్తిగా అటవీ ప్రాంతంలో షూట్ చేశాం. నాకు మెమరబుల్ జర్నీ ఇచ్చిన నా టీంకు థాంక్స్. సినిమా ఫిబ్రవరి 3న రాబోతోంది. ఈ మూవీని చూసి విజయవంతం చేయండి’ అని అన్నారు.

గౌతమ్ మాట్లాడుతూ.. ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం టైటిల్ చాలా క్యాచీగా ఉంది. మణి సర్ మ్యూజిక్‌ చేస్తున్నారని ఆశ్చర్యపోయాను. ఆయన ఒప్పుకున్నారంటే సినిమాలో ఎంత కంటెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. హీరో శ్రీకాంత్, డైరెక్టర్ జైదీప్‌కు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.

జయెత్రి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో తెలుగులో పరిచయం కాబోతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు, కో డైరెక్టర్లకు థాంక్స్. మా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లే మెయిన్ పిల్లర్స్. ఈ సినిమాకు కథ ఒకెత్తు అయితే.. శ్రీకాంత్ అరుపుల అందించిన విజువల్స్ ఇంకో ఎత్తు. మణిశర్మ గారి సంగీతం సినిమాను మరో లెవెల్‌కు చేర్చింది. ఈ సినిమాలో కథే హీరో. కథను నమ్మి సినిమాను చేశాం. ఫిబ్రవరి 3న ఈ సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

కెమెరామెన్ శ్రీకాంత్ అరుపుల మాట్లాడుతూ.. ‘నాకు ఈ సినిమాకు ఎక్కువ ఇక్విప్మెంట్ ఇవ్వలేదు. అది నాకు గర్వంగానే ఉంది. అన్నీ ఇచ్చాక చేసేది ఏముంటుంది. ఏమీ ఇవ్వకపోయినా చేయడంలోనే నా క్రియేటివిటీ బయటకు వస్తుంది. నాకు డైరెక్టర్‌ ఎంతో సహకరించారు. రెగ్యులర్‌గా సినిమాకు జరిగే షూటింగ్‌లా జరగలేదు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరూ నాకు సపోర్ట్‌గా నిలిచారు’ అని అన్నారు.

రైటర్ సంతోష్ మాట్లాడుతూ.. ‘ఓ చిన్న కథను ఇండిపెండెంట్‌ సినిమా తీద్దామని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇంత పెద్ద సినిమా అవుతుందని అనుకోలేదు. ఫిబ్రవరి 3న రాబోతోన్న ఈ సినిమాను పెద్ద హిట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారు. రెబెల్స్ గ్యాంగ్ ఎంతో కష్టపడింది. మా హీరోయిన్ జయెత్రి ఎంతో చక్కగా నటించారు. రాజ్, శ్రీకాంత్ ఈ సినిమాతో నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 3న ఈ సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ‘అనుకున్నది చేసే వరకు పట్టుబట్టే ఈ టీం.. తమను తాము చూసుకునే రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం అని టైలిల్‌ను పెట్టుకున్నట్టున్నారు. తమ తమ ప్యాషన్‌ను, కలలు నెరవేర్చుకునేందుకు ఇలా సినిమాల్లోకి వచ్చారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు సినిమాను ఒప్పుకోవడంతో వీరి మొదటి కల నెరవేరినట్టు అయింది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు. మీ ప్రయత్నం కచ్చితంగా ఫలిస్తుంది. ఇందులో మూడు పాటలు రాశాను. ఈ సినిమాను పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

శివరామ్ మాట్లాడుతూ.. ‘చిన్న సినిమా అయినా కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఫిబ్రవరి 3న ఈ సినిమా విడుదల కాబోతోంది. యూఎస్‌లో ఫిబ్రవరి 2న విడుదల అవుతోంది. సంతోష్ అన్న ఈ కథను అద్భుతంగా రాశాడు. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మేం పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆడియెన్స్ ఇస్తారని అనుకుంటున్నాను’ అని అన్నారు.

Latest News

కిచ్చా సుదీప్ యాక్షన్ ప్యాక్డ్ ‘మ్యాక్స్’ ట్రైలర్ విడుదల

/ మ్యాక్స్‌తో మాట్లాడేటప్పుడు మ్యాగ్జిమమ్ సైలెన్స్ మైంటైన్ చేయాలి… పవర్ ఫుల్ యాక్షన్ & పంచ్ డైలాగులతో 'కిచ్చా' సుదీప్ 'మ్యాక్స్' ట్రైలర్ రిలీజ్ కన్నడ స్టార్ 'కిచ్చా' సుదీప్ కథానాయకుడిగా...

More News