ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో‘ధీక్ష’ ప్రారంభం

ఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ధీక్ష’. పినిశెట్టి అశోక్‌ కుమార్‌ సహ నిర్మాత కాగా, పూర్ణ వెంకటేష్‌ కో`ప్రొడ్యూసర్‌. కిరణ్‌కుమార్‌`భవ్యశ్రీ జంటగా నటిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, బ్రహ్మంగారి ఉపాసకులు బ్రహ్మశ్రీ డా॥ యోగానందకృష్ణమాచార్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపుషాట్‌కు ఆర్‌.కె. గౌడ్‌ క్లాప్‌ను ఇవ్వగా, తూముకుంట నర్సారెడ్డి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు, డా॥ యోగానందకృష్ణమాచార్య తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు, జెవిఆర్‌ & గురురాజ్‌లు స్క్రిప్ట్‌ను అందించారు. 

ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో బ్రహ్మశ్రీ డా॥ యోగానందకృష్ణమాచార్య మాట్లాడుతూ…
ఆర్కే గౌడ్‌ గారితో నాకు మంచి పరిచయం ఉంది. ఈరోజు చాలా మంచి రోజు ఈ సందర్భంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ‘ధీక్ష’ చిత్రం ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. ఈ చిత్రం రామకృష్ణగౌడ్‌ గారికి, నటీనటులు, టెక్నీషియన్‌లకు మంచి పేరు తీసుకు వస్తుంది అన్నారు.

ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ…
ఇటీవల దర్శకత్వం వహించడంలో నేను కొంత గ్యాప్‌ తీసుకున్నాను. మంచి కథ కుదరడంతో మళ్లీ ఈ చిత్రం ద్వారా దర్శక, నిర్మాతగా మీ ముందుకు వస్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదించటానికి విచ్చేసిన నర్సారెడ్డి గారికి, యోగానందకృష్ణమాచార్యులు గారికి, ఇతర మిత్రులు, శ్రేయోభిలాషులకు నా ధన్యవాదాలు. ‘ధీక్ష’ మంచి కథాబలం ఉన్న సినిమా. అవార్డులు కూడా గెలుచుకునే అవకాశం ఉన్న కథ. మే 1వ తేదీ నుంచి షూటింగ్‌ జరుగుతుంది. హైదరాబాద్‌తో పాటు దుబాయ్‌లో కూడా ఒక షెడ్యూల్‌ ఉంటుంది. దీక్ష, పట్టుదలతో ఏపని చేసినా తప్పకుండా సక్సెస్‌ అవుతుంది. ఇది ప్రతి మనిషి విషయంలోనూ జరిగేదే. ఈ విషయాన్ని బేస్‌గా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. అలాగే ఒక ఆడదాని విజయం వెనకాల కూడా ఒక మగాడు ఉంటాడు. పాటల రికార్డింగ్‌ కూడా పూర్తయ్యింది. ఈ సినిమా తర్వాత స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో మరో సినిమా చేయబోతున్నా. అందులో హీరో తేజ నెగెటివ్‌ రోల్‌ చేస్తున్నారు. సాంగ్స్‌ కూడా కంప్లీట్‌ అయ్యాయి. మంచి క్వాలిటీతో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా తీస్తాము. యూనిట్‌ అందరికీ మంచి పేరు తెచ్చే చిత్రమిది. ఇకపై మా ఆర్‌.కె. ఫిలింస్‌ బ్యానర్‌పై కంటిన్యూగా సినిమాలు చేయాలనే సంకల్పంతో ఉన్నాం అన్నారు.

తూముకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ…
ఆర్‌.కె. గౌడ్‌ గారు రాజకీయాల్లో కూడా ఉన్నారు. మంచి ప్రజాసేవకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కళామతల్లి సేవలో ఉండిపోయారు. ఆయన మళ్లీ అటు ప్రజా సేవలో కూడా పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు చిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం చాలా తపన పడుతున్నారు. కాబట్టి రామకృష్ణగౌడ్‌ గారు ఆయన జత కలిస్తే పరిశ్రమకు మరింత మేలు జరుగుతుందని నా ఆశ. ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ ‘ధీక్ష’ తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

టి.ఎఫ్‌.సి.సి వైస్‌ ప్రెసిడెంట్‌ గురురాజ్‌ మాట్లాడుతూ…
ఇంతమంది శ్రేయోభిలాషుల మధ్య ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం విజయం తధ్యం. ఇప్పటికే ఎంతోమంది నటులు, టెక్నీషియన్‌లను పరిశ్రమకు పరిచయం చేశాం. వారు ఇప్పడు మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఈ సినిమా ద్వారా కూడా మరింత మంది టాలెంటెడ్‌ వ్యక్తులు పరిశ్రమకు పరిచయం అవుతారు. అందరి ఆశీర్వాదాలు కావాలి అన్నారు.

టి.ఎఫ్‌.సి.సి వైస్‌ ప్రెసిడెంట్‌ జె.వి.ఆర్‌ మాట్లాడుతూ…
మంచి నటీనటులు, టెక్నీషియన్స్‌తో ఆర్‌.కె. గౌడ్‌గారు చేస్తున్న ఈ ధీక్ష విజయవంతం కావాలి. సినిమాకు ప్రజల నుంచి రివార్డులతో పాటు, ప్రభుత్వాల నుంచి అవార్డులు కూడా రావాలి. ఇది మరిన్ని చిన్న సినిమాల నిర్మాణానికి మార్గదర్శి కావాలి అన్నారు.

హీరో, హీరోయిన్‌లు కిరణ్‌`భవ్యశ్రీలు మాట్లాడుతూ…
మంచి కంటెంట్‌ ఉన్న సినిమా ఇది. ఇంత మంచి సినిమాకు మమ్మల్ని సెలక్ట్‌ చేసుకున్న ఆర్‌.కె. గౌడ్‌ గారికి, ఇతర నిర్మాతలకు థ్యాంక్స్‌. నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలు కావడం మా అదృష్టం. అందరికీ మంచి పేరు, పేరుతో పాటు అవార్డులు తెచ్చే సినిమా ధీక్ష అని కాన్ఫిడెంట్‌గా చెపుతున్నాం అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేవీఆర్‌, నిర్మాత వెంకటేశ్వర్లు, చిత్తజల్లు ప్రసాద్‌, రచయిత మేడ ప్రసాద్‌, నిర్మాత గిరి తదితరులు ప్రతాని రామకృష్ణగౌడ్‌ గారి దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రంతో మరోసారి టాలీవుడ్‌కు రికార్డుల పంట పండిరచాలని కోరుకున్నారు. ధీక్ష చిత్రానికి సంబంధించి టెక్నీషియన్స్‌, నటీనటుల వివరాలో అతి త్వరలో ప్రకటించనున్నారు.

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

‘ఇరుముడి’ కి చాలా నేషనల్ అవార్డ్స్ వస్తాయి. ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుంది. ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ గారి సినిమాల్లో నా ఫేవరెట్ ఇరుముడి: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో,…

5 hours ago

అభిమానం ముందు అనారోగ్యం కూడా ఓడిపోవాలి… శశి కోసం రామ్ పోతినేని చేసిన మానవీయ ప్రయత్నం

రెండేళ్ల క్రితం వరకు శషి కూడా అందరిలాగే చదువుకుంటూ, ఆడుతూ పాడుతూ, ఎంతో ఆనందంగా గడిపిన ఓ చిన్నారి. కానీ…

6 hours ago

తెలంగాణ నుండి 9,600 మందికి పైగా గ్రామీణ క్రీడాకారులను ఒకే తాటిపైకి తెచ్చిన ఈశా గ్రామోత్సవం; ఎల్బీ స్టేడియంలో స్టేట్ ఫైనల్ నిర్వహణ

ఆగస్టు 16, హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద గ్రామీణ క్రీడోత్సవం అయిన ఈశా గ్రామోత్సవం 2026 - తెలంగాణ ఎడిషన్లో రాష్ట్రవ్యాప్తంగా…

1 day ago

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం.

వీటి ఎంటర్ ప్రైజెస్ పతాకం పై హరిహరన్, శ్రీలేఖ, సుహానా హరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న" దొరికిందా" చిత్రం నేడు హైదరాబాద్…

1 day ago

‘ది రెడ్ బ్యాగ్’ చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ఉంటుంది : నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి

మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే…

1 day ago

పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ బహుజన…

1 day ago