టాలీవుడ్

బఘీర కి ప్రశాంత్ నీల్ గారు యూనివర్సల్ అప్పీల్ ఉండే స్టొరీ హీరో శ్రీమురళి

ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్ అచ్యుత్ కుమార్, గరుడ రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. పలు బ్లాక్‌బస్టర్‌లను విజయవంతంగా డిస్ట్రిబ్యూషన్ చేసిన టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బఘీర విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీమురళి విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

‘బఘీర’ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది ?
-ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ స్టోరీ ఇచ్చారు. నన్ను ఈ స్టొరీ చేయమని చెప్పారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నా కెరీర్ లో ఉగ్రం లాంటి ఒక గొప్ప సినిమా ఇచ్చారు. ఉగ్రం సినిమా సమయంలో మేము చాలా క్లోజ్ అయ్యాం. హోంబలే ఫిలింస్ ప్రొడ్యూస్ చేస్తామని ముందుకు వచ్చారు. అలా ఈ ప్రాజెక్టు మొదలైంది.

తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు ?
-మా అత్తగారిది నెల్లూరు. ఇంట్లో వైఫ్, అత్తగారు తెలుగు మాట్లాడుతారు. అలా వచ్చింది (నవ్వుతూ)

ఈ క్యారెక్టర్ కోసం మూడేళ్లు జిమ్ ట్రైనింగ్ తీసుకున్నారని విన్నాం ?
-అవునండి. క్యారెక్టర్ అలాంటిది. నేను నిజానికి ఫుడ్ లవర్ ని. చికెన్, మటన్, రైస్ అన్ని ఇష్టంగా తింటాను. బిర్యాని అంటే పిచ్చి. కానీ ఈ మూడేళ్లు చాలా కష్టంగా గడిచింది. చాలా స్ట్రిక్ డైట్ చేశాను. లిక్విడ్ డైట్ చేశాను. అది చాలా ఛాలెంజ్. నా కెరీర్లో ఇది వెరీ డేరింగ్, అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్. క్యారెక్టర్ డిమాండ్ ప్రకారం చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశాను. ఈ మూడేళ్లలో నాలో చాలా మార్పులు వచ్చాయి.  

డైరెక్టర్ డాక్టర్ సూరి గురించి ?
-ప్రశాంత్ నీల్ గారు స్టోరీ ఇచ్చారు. డైరెక్టర్ సూరి గారు 100% కథని అద్భుతంగా స్క్రీన్ మీదకు  తీసుకొచ్చారు. ఈ స్టోరీని, ఐడియాని అద్భుతంగా ఎరలైజ్ చేశారు. ఈ స్క్రిప్ట్ కి ఏం కావాలో అవన్నీ అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు. ఇది లార్జర్ దెన్  లైఫ్ క్యారెక్టర్. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కంటెంట్. డైరెక్టర్ గారు నా నుండి చాలా మంచి పెర్ఫార్మన్స్ ని రాబట్టుకున్నారు. పర్సనల్ గా ఇది నాకు చాలా ఫేవరెట్ క్యారెక్టర్. సూరి గారి లాంటి బ్రిలియంట్ టెక్నీషియన్ తో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.  

ప్రశాంత్  నీల్ గారి సపోర్టు ఎలా ఉండేది?
-నాకు ప్రశాంత్ నీల్ గారి సపోర్టు ఎప్పుడు ఉంటుంది. టీంలో అందరం డిస్కస్ చేసుకునేవాళ్ళు. ప్రశాంత్ నీల్ గారికి గ్రేట్ విజన్ ఉంది. నన్ను ఆయన చూసే పర్స్పెక్టివ్  డిఫరెంట్. ఆయన నన్ను చాలా బలంగా నమ్మారు.

-ఈ సినిమా విషయంలో నాదొక సిన్సియర్ రిక్వెస్ట్, సినిమాకి బ్లాంక్ మైండ్ తో రండి. నన్ను ఒక న్యూ బోర్న్ యాక్టర్ గానే చూసి బ్లెస్స్ చేయమని కోరుతున్నాను. ఉగ్రం, బఘీర కంప్లీట్ డిఫరెంట్ ఫిలిమ్స్. ప్రతి ఒక్కరిలో హీరో ఉంటారు. ఆ హీరో ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. ‘బఘీర’ సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా ‘బఘీర’లా ఫీల్ అవుతారని నమ్ముకున్నాను. తప్పకుండా అందరూ వచ్చి సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.

-ఈ సినిమా కి మంచి కథ కుదిరింది. క్యారెక్టర్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఎలిమెంట్ ఆడియన్ కనెక్ట్  అవుతుంది.

ఈ సినిమా షూటింగ్ లో మీకు గాయాలు అయ్యాయని విన్నాం ?
-షూటింగ్ లో అవి కామన్. నిజంగా ఈ సినిమా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే నాకు నా సినిమానే ఇంపార్టెంట్. నేను ఆ గాయాల గురించి పట్టించుకోలేదు.

 రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్ గారి వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి ?
-ఫెంటాస్టిక్. నేను ప్రకాష్ రాజు గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. రుక్మిణి వసంత్ వెరీ గుడ్ హీరోయిన్. వెరీ సిన్సియర్, వెరీ నేచురల్ యాక్టర్.

మీ నుంచి తెలుగులో వస్తున్న మొదటి సినిమా ఇది, ఈ సినిమానే తీసుకురావడానికి కారణం?
-ఇది మా ప్రొడక్షన్ కాల్. చాలా మంచి సినిమా చేశా. దేశమంతా చూడదగ్గ సినిమా ఇది. ఆ నమ్మకంతో ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం. తెలుగు ప్రేక్షకుల నుంచి లవ్, సపోర్ట్ లభిస్తుందని నమ్ముతున్నాను.

అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ గురించి ?
-అజనీష్ ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయన డిఫరెంట్ సినిమాలు చేస్తుంటారు. మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో చాలా డిఫరెంట్ మ్యూజిక్ ఉంటుంది. ఇందులో లవ్ ట్రాక్, ఎమోషనల్ ట్రాక్స్ , కథని డ్రైవ్ చేసే మ్యూజిక్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. గ్రేట్ అవుట్ ఫుట్ ఇచ్చారు.  

ఉగ్రం 2 అనౌన్స్ చేశారు కదా.. అందులో మీ క్యారెక్టర్ గురించి ?
-అది నాకు తెలియదండి. మీరు ప్రశాంత్ నీల్ గారిని అడగాలి (నవ్వుతూ). ఆయనతో వర్క్ చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను.

ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లు పూర్తయింది కదా.. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది?
-ఫెంటాస్టిక్ జర్నీ. నా సినిమాలన్నీ ఇష్టపడి చేశాను. మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నాను. ఇంకా బెటర్ మూవీస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ జర్నీలో ఎత్తు పల్లాలు ఉన్నాయి. ఉగ్రం తర్వాత రీబర్త్ వచ్చింది.  అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2014 నుంచి ఇప్పటివరకు నా సినిమాలన్నీ సక్సెస్ఫుల్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను.

మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతారా?
-కథ బావుండి, కథలో నా క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటే మల్టీ స్టారర్స్ లో పార్ట్ అవడం నాకు ఇష్టమే.

Tfja Team

Recent Posts

ఓ భామ అయ్యో రామ’ చిత్రంతో అతిథి పాత్రలో మెరవనున్న దర్శకుడు హరీష్‌ శంకర్‌

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథానాయకుడు సుహాస్ , మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి…

19 hours ago

Harish Shankar Guest Appearance in Oh Bhama Ayyo Rama

In an exciting addition, renowned mass director Harish Shankar will be seen in a guest…

19 hours ago

ఫిబ్రవరి 28న రానున్న ఆదిత్య ఓం ‘బంధీ’

వాతావరణ పరిరక్షణపై సామాజిక సందేశాన్ని ఇస్తూ ఆదిత్య ఓం చేసిన చిత్రం ‘బంధీ’. రఘు తిరుమల దర్శకత్వం వహించిన ఈ…

19 hours ago

Aditya Om’s Bandi Releasing On February 28th

Aditya Om's upcoming film Bandi, inspired by the pressing issue of climate change, is all…

19 hours ago

ఈ రోజు నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ “మార్కో”

ఉన్ని ముకుందన్ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ…

22 hours ago

Action Thriller “Marco” Streaming on aha from Today

Unni Mukundan's blockbuster action thriller, Marco, is now available for streaming on the aha OTT…

22 hours ago