తెలుగులో నవంబర్ 7 రాత్రి పెయిడ్ ప్రీమియర్లతో ప్రణవ్ మోహన్ లాల్ ‘డీయస్ ఈరే’… శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

ప్రణవ్ మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘డీయస్ ఈరే’. మిస్టరీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందింది. ‘భూత కాలం’, ‘భ్రమ యుగం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సంస్థలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది.

మలయాళంలో అక్టోబర్ 31న ‘డీయస్ ఈరే’ విడుదలైంది. నవంబర్ 7న (శుక్రవారం) పెయిడ్ ప్రీమియర్లతో తెలుగు వెర్షన్ విడుదల చేస్తున్నారు. నవంబర్ 8న (శనివారం) రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో సినిమా విడుదల కానుంది. ఈ రోజు ‘డీయస్ ఈరే’ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. 

‘డీయస్ ఈరే’ ట్రైలర్ చూస్తే… ఓ విలాసవంతమైన భవంతి కనిపిస్తుంది. అందులో ఓ వ్యక్తి మహిళ హెయిర్ క్లిప్ పట్టుకుని కూర్చుంటాడు. ఆ తర్వాత వింత గొంతు ఒకటి వినబడుతుంది. ‘ఆకాశం… భూమి… భూడిద అవ్వగా, లోకం కన్నీళ్ల భయంతో నిండుతుంది’ అని ట్రైలర్ ముగిసింది. కథ ఏమిటి? అనేది రివీల్ చేయకుండా హారర్, థ్రిల్స్ ఎలిమెంట్స్ పుష్కంలంగా ఉన్నాయని చెప్పారు.      

మలయాళంలో ‘డీయస్ ఈరే’కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. వసూళ్లతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. కమల్ హాసన్ ‘పుష్పక విమానం’, ‘నాయకుడు’ నుంచి ధనుష్ ‘రఘువరన్ బీటెక్’ వరకు తెలుగులో శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేసిన పరభాషా సినిమాలు భారీ విజయాలు సాధించడంతో పాటు విమర్శకుల – ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. ఆ కోవలో ‘డియస్ ఈరే’ కూడా చేరుతుందని చెప్పవచ్చు. 

‘డీయస్ ఈరే’ సినిమాలో సుష్మితా భట్, జిబిన్ గోపీనాథ్, జయ కురుప్, మనోహరి జాయ్, అరుణ్ అజికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా రాహుల్ సదాశివన్ రచన, దర్శకత్వంలో రూపొందిన ‘డియస్ ఈరే’ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు

Tfja Team

Recent Posts

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…

2 days ago

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…

2 days ago

మా నమ్మకం నిజమైంది.. తెలుగునాట ‘జైలర్ 2’ ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

3 days ago

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…

3 days ago

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…

3 days ago

“రణబాలి” సినిమాలోని జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించిన హీరోయిన్ రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…

5 days ago