‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్! సినిమాకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన

జైనీ క్రియేషన్స్ పతాకంపై మూలవిరాట్, పద్మ,రాజ్ కుమార్, స్వప్న నటీ నటులుగా ”అమ్మ నీకు వందనం”,  ”క్యాంపస్ అంపశయ్య’’,  “ప్రణయ వీధుల్లో” వంటి సామాజిక, ప్రయోజనాత్మక సినిమాలు తీసిన ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!.. డిసెంబర్ 23 న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతూ  విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సందర్భంగా   

చిత్ర నిర్మాత శ్రీమతి విజయలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణాకు చెందిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణ రావు గారి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాను మేము ఎంతో దృఢ సంకల్పంతో రాత్రింబవళ్ళు కష్టపడి ఇష్టంగా నిర్మించడం జరిగింది.అయితే ఈ సినిమాను  మేము వ్యాపార పరంగా కాకుండా కళాత్మకంగా సినిమా తీయడం జరిగింది. అందుకే ముందు భవిష్యత్ తరాలైన విద్యార్థులకు కాళోజి గారి చరిత్ర గురించి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో విద్యార్థులకు థియేటర్ లో ఉదయం ఆటను ఉచితంగా ప్రదర్శించడం జరిగింది. ఇందుకు విద్యార్థుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది . అయితే మేము అనుకున్న ప్రయత్నం ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది. చరిత్ర కలిగిన ఇలాంటి సినిమా కెరీర్ పరంగా నాకు మంచి గుర్తింపుగా భావిస్తున్నాను .ఇలాంటి మంచి సినిమాను నాకు ఇచ్చిన చిత్ర దర్శకుడు, నా శ్రీ వారు ప్రభాకర్ జైనీ కి థాంక్యూ సో మచ్ అని అన్నారు.

చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ…మన కాలపు మహాకవి కాళోజీ గారి సందేశం, మన విద్యార్థులకైనా చేరితే, సినిమా తీసిన ప్రయోజనం నెరవేరుతుందనే ఉద్దేశ్యంతో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డిసెంబరు 23 నుండి  రోజూ ఉదయం ఆటను స్కూలు పిల్లలకు ఉచితంగా థియేటర్లలో ప్రదర్శించడం జరిగింది. మేము ఊహించిన దాని కన్నా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా రిలీజ్ కు సంహరించిన గవర్నమెంట్ పెద్దలకు నా ధన్యవాదాలు అని అన్నారు.

నటీ నటులు
కాళోజీ గారితో చిరకాలంగా సన్నిహితంగా మెదిలిన అన్వర్, పీవీ నరసింహారావు పాత్రలో వారి సోదరుడు, పీవీ మనోహర్ రావు, ప్రముఖ కవి తుమ్మూరి రామ్మోహన్ రావు, వైభవ్ సూర్య, శంకర్, మల్లికార్జున్, ప్రియ, రాధిక, నరేశ్, రజని, దేవేందర్ రెడ్డి, జమీందారు పాత్రలో ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ వైయస్సార్ శర్మ నటించారు.  మిసెస్ ఇండియా  సుష్మా తోడేటి తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్: జైనీ క్రియేషన్స్,
నిర్మాత: విజయలక్ష్మీ జైనీ,
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రభాకర్ జైనీ.
కెమెరామెన్: స్వర్గీయ రవి కుమార్ నీర్ల;
సంగీతం: యస్.యస్.ఆత్రేయ,
నేపథ్య సంగీతం: మల్లిక్ యం.వి.కే;
ఎడిటింగ్: కొండవీటి రవి కుమార్,
సెకండ్ యూనిట్ కెమెరా:  భాస్కర్,
పి. ఆర్. ఓ : మూర్తి

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

మైత్రి మూవీ మేకర్స్ ప్రజెంట్స్- సత్య, రితేష్ రానా, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘జెట్లీ’ మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత…

20 minutes ago

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్” తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల…

55 minutes ago

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

1 day ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

1 day ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

1 day ago