* అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలుగా సినిమా
దక్షిణాది సినీ రంగం ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్. ఈ సంస్థ నిర్మించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘లవ్ టుడే’. ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే ప్రదీప్ రంగనాథన్ సినిమాను డైరెక్ట్ చేశారు. అన్నీ వర్గాల మన్ననలు అందుకుంటూ ఈ సినిమా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.
ఈ చిత్రానికి కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా మెప్పించనున్నారు. ఈ మే నెల నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రముఖ నటీనటులందరూ ఇందులో నటించనున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందుతోన్న 26వ సినిమా ఇది.
కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను మేకర్స్ విడుదల చేయగా, సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రదీప్ రంగనాథన్, అశ్వత్ మారిముత్తు మధ్య ఉన్న నిజ జీవితంలోని స్నేహాన్ని తెలియజేస్తూ ఎంటర్‌టైనింగ్‌గా వీడియో ఉంది.
ఈ ఎమోషనల్ మూవీకి అర్చనా కల్పాతి క్రియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుంటే ఐశ్వర్యా కల్పాతి అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రదీప్ ఇ.రాఘవ్ ఎడిటర్‌గా, ఎస్.ఎం.వెంకట్ మాణిక్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా క్రియేటివ్ ప్రొడ్యూసర్ అర్చనా కల్పాతి మాట్లాడుతూ ‘‘లవ్ టుడే’ చిత్రంతో ప్రేక్షకుల హృదయాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్‌తో మరోసారి కలిసి పని చేయటం ఆనందంగా ఉంది. అలాగే ఓ మై కడవులే సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం ఆనందంగా ఉంది. వీరి కలయికలో రాబోతున్న ఈ సినిమా ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సూపర్ హిట్ చిత్రాల సరసన నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు.
సినిమా టైటిల్.. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలియజేసింది.
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…