‘సీతారామం’ హ్యూజ్ బ్లాక్‌బస్టర్ తో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దర్శకుడు హను రాఘవపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్‌తో యాక్షన్ అంశాలతో కూడిన ఫిక్షనల్ పీరియాడిక్ చిత్రం కోసం చేతులు కలపనున్నారు హను రాఘవపూడి.
వరంగల్‌లోని ఎన్‌ఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో హను రాఘవపూడి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ ప్రభాస్‌తో తన సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. “ప్రభాస్‌తో నా నెక్స్ట్ చిత్రం హిస్టరీ ఆల్టర్నేటివ్ నెరేటివ్ తో కూడిన పీరియాడికల్ యాక్షన్.”అన్నారు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే మూడు పాటలను కంపోజ్ చేసినట్లు దర్శకుడు తెలియజేశారు.ఈ డెడ్లీ కాంబినేషన్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు మేకర్స్.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…