‘విరూపాక్ష’ టీజర్‌ను అప్రిషియేట్ చేసిన ‘ప‌వ‌ర్‌స్టార్‘


సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష‌’ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది.  కార్తీక్ దండు ద‌ర్శ‌కుడిగా బాపినీడు.బి సమర్పణలో ప్రముఖ నిర్మాత బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్తా మీన‌న్ హీరోయిన్‌. తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ, హిందీ భాషల్లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 21న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్‌కి స‌న్న‌ద్ధ‌మవుతుంది. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ మూవీ టీజ‌ర్‌ను మార్చి 1న‌ విడుద‌ల చేస్తున్నారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారుప్ర‌త్యేకంగా ఈ టీజ‌ర్‌ను వీక్షించారు. టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంద‌ని ఎంటైర్ యూనిట్‌ను ఆయ‌న అప్రిషియేట్ చేస్తూ.. సినిమా చాలా పెద్ద విజయం సాధించాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా.. 

చిత్ర నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అత్తారింటికి దారేది హీరో మ‌న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు మా విరూపాక్ష ట్రైల‌ర్‌ను చూశారు. ఆయ‌నకెంతో న‌చ్చింది. విజువ‌ల్స్‌, బీజీఎం అన్నీ బావున్నాయని తేజ్ తో స‌హా ఎంటైర్ టీమ్‌ను అప్రిషియేట్ చేశారు. ఈ టీజర్ ని మొట్టమొదటగా ఆయనకి చూపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయ‌న్నుంచి వ‌చ్చిన ప్ర‌శంస‌లు మాకెంతో ఎన‌ర్జీని ఇచ్చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు తేజ్ చేసిన సినిమాల‌కు పూర్తి భిన్న‌మైన మూవీ ఇది. సరికొత్తగా ఉంటుంది. ఏప్రిల్ 21న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాను రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

న‌టీన‌టులు:

సాయిధ‌ర‌మ్ తేజ్‌, సంయుక్తా మీన‌న్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

బ్యాన‌ర్స్‌:  శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్‌

స‌మ‌ర్ప‌ణ‌:  బాపినీడు

నిర్మాత‌:  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌

ద‌ర్శ‌క‌త్వం:  కార్తీక్ దండు

సినిమాటోగ్రాఫ‌ర్ :  శ్యామ్‌ద‌త్ సైనుద్దీన్‌

మ్యూజిక్ డైరెక్ట‌ర్:  బి.అజ‌నీష్ లోక్‌నాథ్‌

ఎడిట‌ర్‌:  న‌వీన్ నూలి

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  శ్రీ నాగేంద్ర తంగల‌

క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌:  స‌తీష్ బి.కె.ఆర్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  అశోక్ బండ్రెడ్డి

పి.ఆర్‌.ఓ:  వంశీ కాకా, మధు మాడూరి

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

6 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago